రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలం లోని కోడూరు, ధర్మపూర్, ఓబులయా పల్లి, ఓబులయా పల్లి తాండ, పట్టణంలో ని వీరన్న పేట, న్యూ గంజ్ లకు చెందిన BJP పార్టీ సుమారు 500 మంది కార్యకర్తలు TRS పార్టీ లో చేరారు. సీఎం కేసీఆర్ గారి సహకారంతో మహబూబ్ నగర్ జిల్లా ను అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేస్తున్న మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారి కృషి పట్ల ఆకర్షితులై BJP పార్టీ కి రాజీనామా చేసి TRS పార్టీ లో చేరుతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలోజిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గోపాల్ యాదవ్, జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, మున్సిపల్ చైర్మన్ KC నర్సింహులు, MUDA చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేష్, ZPTC వెంకటేశ్వరమ్మ రవీందర్ రెడ్డి, AMC చైర్మన్ రెహమాన్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్ లు నర్సింహ, కిషోర్, మోతిలాల్, యాదగిరి గౌడ్, మాజీ AMC చైర్మన్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.







