ఆ సెట్ లో నుంచి ఐశ్వర్య రాయ్ ను ఎత్తుకెళ్ళిపోయా.. హీరో కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బచ్చన్ ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ ఇండస్ట్రీలో బచ్చన్ ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు కూడా ఉంది.

 Abhishek Bachchan Stole Aishwarya Rai Guru Movie Sets Abhishek Bachchan, Aishwarya Rai, Bollywood, Guru Film, Case Toh Banta Hai, Guru Film-TeluguStop.com

నటుడు అమితాబ్ బచ్చన్ గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అమితాబ్ బచ్చన్ కు కేవలం బాలీవుడ్ ని ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులు ఉన్నారు.

అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా హీరోగా బాలీవుడ్ ని ఇండస్ట్రీ లోపల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.కాగా అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ హీరోయిన్,అందాల ముద్దుగుమ్మ, సుందరి అయిన ఐశ్వర్యరాయ్ ఏప్రిల్ 20, 2007 లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

 Abhishek Bachchan Stole Aishwarya Rai Guru Movie Sets Abhishek Bachchan, Aishwarya Rai, Bollywood, Guru Film, Case Toh Banta Hai, Guru Film-ఆ సెట్ లో నుంచి ఐశ్వర్య రాయ్ ను ఎత్తుకెళ్ళిపోయా.. హీరో కామెంట్స్ వైరల్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గురు సినిమా షూటింగ్‌ సమయంలో అభిషేక్‌, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

కాగా ఈ దంపతులకు ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది.ఇక అభిషేక్ బచ్చన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా భార్య ఐశ్వర్యారాయ్, కూతురు ఆరాధ్యతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

కాగా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఐశ్వర్య.ఇకపోతే ఇటీవల ఐశ్వర్య రెండవసారి గర్భవతి అయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

కానీ ఆ వార్తలపై అటు ఐశ్వర్యారాయ్ కానీ లేదా అభిషేక్ బచ్చన్ కానీ స్పందించకపోవడంతో అవి రూమర్స్ అని తేలిపోయింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక కామెడీ షో లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ ని ఎత్తుకెళ్లిపోయాను అంటూ ఫన్నీగా సమాధానం ఇవ్వడం వైరల్ గా మారింది.అభిషేక్‌ బచ్చన్‌ తాజాగా కేస్‌ తో బంతా హై అనే కామెడీ షోలో పాల్గొన్నారు.కాగా తాజాగా అందుకు సంబంధించి ఒక ప్రోమో రిలీజ్‌ చేశారు.ఇందులో హోస్ట్‌ రితేష్‌ దేశ్‌ముఖ్‌ అభిషేక్‌ బచ్చన్‌ సెట్స్‌లో కొన్ని వస్తువులు దొంగతనం చేశాడని సరదాగా ఆరోపించాడు.అప్పుడు ఆ విషయం పై స్పందించిన అభిషేక్ బచ్చన్.

అవును, గురు సెట్స్‌లో ఐశ్వర్య రాయ్‌ను ఎత్తుకెళ్లిపోయాను అంటూ ఫన్నీగా నవ్వుతూ రిప్లై ఇచ్చాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube