ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం కార్తికేయ 2. నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన కార్తికేయ -2 చిత్రం ఘనవిజయం సాధించింది.
అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఈ సంధర్బంగా కార్తికేయ- 2 చిత్ర బృందం థాంక్స్ మీట్ ను నిర్వహించారు.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.దర్శకుడు చందు మొండేటి కథ చెప్పిన దానికంటే, అద్భుతంగా ఈ సినిమాను తీశారు.నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.సినిమాకి అని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతూ కార్తికేయ సాంకేతిక నిపుణలకు కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.రెండు పాండమిక్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయింది.ఈ సినిమా సక్సెస్ తో ఆ కష్టం అంతా మర్చిపోయాను.ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది నేను చాలా ఎమోషనల్ ఐపోయాను.
చాలా సంతోషంగా ఉంది.థాంక్స్ ఫర్ యూ సపోర్ట్.

హీరో నిఖిల్ మాట్లాడుతూ… మీడియా మిత్రులకు చాలా థాంక్స్ అండి, ఈ సినిమాకి యూఎస్ ముందుగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేసాం.ఇక్కడ సినిమా అవ్వగానే నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.
అన్నీ చోట్ల హౌస్ ఫుల్ అవుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి.
నా సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు.రేపు ఎల్లుండి కూడా బుకింగ్స్ బాగున్నాయి.
ఇది ఇలానే కొనసాగుతుంది అని నేను అనుకుంటున్నాను.చందు మంచి పాయింట్ తీసుకుని అద్భుతంగా తీసాడు అని చెబుతూ కార్తికేయ టెక్నీషియన్స్ కృతజ్ఞతలు తెలిపారు.