బుల్లితెర పై ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి.బిగ్ బాస్ ( Bigg Boss) కార్యక్రమం అన్ని భాషల్లో ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.
ఇక తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే ఆరో సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ కూడా 10 వారాలను పూర్తి చేసుకుంది.ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా పలువురు కంటెస్టెంట్ లో ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఎలిమినేట్ అయినటువంటి వారిలో సందీప్ మాస్టర్ ఒకరు.
ఆట డాన్స్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సందీప్ మాస్టర్ ( Sandeep Master ) బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఎనిమిది వారాలపాటు కొనసాగినటువంటి ఈయన ఎనిమిదవ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.ఇలా 8 వారాలపాటు హౌస్ లో కొనసాగి బయటకు వచ్చినటువంటి ఈయన ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సందీప్ మాస్టర్ హౌస్ లో ఫుడ్ కష్టాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హౌస్ హౌస్ లో ఉంటే కనుక చాలా లిమిటెడ్ గా ఫుడ్ వస్తుందని తెలిపారు. బ్రేక్ ఫాస్ట్ అసలు ఉండదు.డైరెక్ట్ లంచ్ చేయాల్సి ఉంటుందని ఈయన తెలిపారు.వచ్చే బడ్జెట్లో చాలా ఐటమ్స్ ఏమీ రావని ఉన్నదాంట్లోనే సర్దుకోవాల్సి ఉంటుందని ఈయన తెలిపారు.అయితే బిగ్ బాస్ నిర్వహించే టాస్కులు ఆడి తిరిగి అంతమందికి ఫుడ్ చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి అందుకే మిగిలిన అన్నం కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరుసటి రోజు తిన్న రోజుల్లో కూడా ఉన్నాయని సందీప్ మాస్టర్ తెలిపారు.
ఇలా గ్రోసరీ లిమిట్ గా వచ్చినప్పటికీ ఫ్రూట్స్ మాత్రం పంపించేవారని ఈయన తెలియజేశారు.ఇక ఒక బిస్కెట్ ప్యాకెట్ పంపిస్తే దానినే అందరూ షేర్ చేసుకోవాలని ఒక బ్రెడ్ ప్యాకెట్ పంపించిన బ్రెడ్ ప్యాకెట్ కంటెస్టెంట్లు మొత్తం షేర్ చేసుకోవాల్సి ఉంటుందని సందీప్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కష్టాల గురించి తెలియజేశారు.బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఆడటంలోనే అందరూ అలసిపోతారని అదేవిధంగా ఆ హౌస్ లంకంత ఉంటుంది.
అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తడంలోనే మెంటల్ టార్చర్ ఉంటుందని ఈయన తెలియచేశారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని తాను 12 నుంచి 15 కేజీల వరకు బరువు తగ్గాను అంటూ సందీప్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే ప్రతి ఒక్కరూ కూడా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి అది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందని, తాను కూడా హౌస్ నుంచి బయటకు వచ్చిన అక్కడున్న అలవాట్లనే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను అంటూ ఈయన తెలియజేశారు.