కర్ణాటకలో( Karnataka ) పరిపాలన చూపించి దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలను కాంగ్రెస్( Congress ) మోసం చేస్తుందని, అసలు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లో హామీ ఇచ్చిన ఐదు గ్యారంటీ లలో ఏ ఒక్కటి కూడా కర్ణాటకలో అమలు కావడం లేదని, కర్ణాటకలో ఏ సబ్ స్టేషన్ కి వెళ్లినా ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారో తెలిసిపోతుందని, ఇక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తుందంటూ విమర్శించారు జెడియస్ అదినేత కుమారస్వామి( Kumaraswamy ).
దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైన విధానాలను అవలంబిస్తుందని, ప్రజలకు కలబొల్లి హామీలు ఇచ్చి దొడ్డిదారిన అధికారం లోకి రావాలని చూస్తుందంటూ ఆయన ఫైర్ అయ్యారు.రైతులకు గొప్ప మేలు చేస్తామని చెప్పి ఈరోజు వారిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా పరిస్థితిని సృష్టించిన పాపం కాంగ్రెస్ దేనని ఆయన దుయ్యబట్టారు .ఇంతకుముందు బిజేపి ప్రభుత్వం( BJP ) కర్ణాటకలో రైతులకు నాలుగు వేలు ఇచ్చేదని ఇప్పుడు దానిని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని ఇప్పటివరకు నయా పైసా పరిహారం ఇవ్వలేదని ఈ ప్రభుత్వం వచ్చాక 65 లక్షల హెక్టార్లలో పంటలు నష్టపోయాయని, 10 లక్షల కుటుంబాలకు పైగా గృహ లక్ష్మీ పథకం ( Griha Lakshmi Scheme )కింద ఒక పైసా కూడా విడుదల చేయలేదని చెప్పుకొచ్చారు.
మాట్లాడితే సర్వర్ డౌన్ అని చెప్పి తప్పించుకుంటున్నారని , రైతుల పట్ల కాంగ్రెస్ కు చిత్త శుద్ది లేదని ఆయన మండిపడ్డారు .అయితే తెలంగాణ ఎన్నికల్లో బి ఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకే బిజెపి కర్ణాటక నేతలతో ఇక్కద స్టేట్మెంట్లు ఇప్పిస్తుందని, తాము ఎలాగూ గెలవం అని తెలిసిసపోయింది కాబట్టి బీఆరఎస్ తో కలసి దొడ్డి దారిన గెలవాలని బిజేపి చూస్తుందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు .ప్రజలు మా ప్రక్కనే ఉన్నారని ఈ అవినీతి ప్రభుత్వాని తిరస్కరించి కాంగ్రెస్ కి తెలంగాణా ప్రజలు పట్టం కట్ట బోతున్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు జోస్యం చెబుతున్నారు .