అను అగర్వాల్.ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకొచ్చే సినిమా ఆషికి.
మహేష్ భట్ దర్శకత్వంలో రాహుల్, అను అగర్వాల్ కలిసి నటించిన ఆషికి సినిమా 1990లో విడుదలైన విషయం తెలిసిందే.అప్పట్లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు హీరో రాహుల్ అలాగే అను అగర్వాల్ ను రాత్రికి రాత్రే స్టార్లుగా మార్చేసింది.
అంతేకాకుండా ఈ సినిమాతో రాహుల్ అను అగర్వాల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.కానీ వారు ఇద్దరూ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నెమ్మదిగా వెండితెర కు దూరమవుతూ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయారు.
ఇది ఇలా ఉంటే తాజాగా అను అగర్వాల్ బర్త్డే.సందర్బంగా అను అగర్వాల్ గురించి పలు ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.మొదట మోడల్ గా పనిచేసిన అను అగర్వాల్ ఆషికి సినిమాతో ఇండస్ట్రీకి ఎంసి ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.మొదటి సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో ఆమెకు హాలీవుడ్ లో కూడా ఆఫర్లు వచ్చినట్టుగా అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి.అయితే బాలీవుడ్లో స్టార్ హీరో ల సరసన నటించినప్పటికీ అవి సరిగా క్లిక్ అవ్వకపోవడంతో నెమ్మదిగా బాలీవుడ్ నుంచి సైడ్ అయిపోయింది.1999 లో ఆమె ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో పాటు 29 రోజులు కోమాలోనే ఉండిపోయింది.

ఆ తర్వాత కోలుకుంది కానీ గతాన్ని మర్చిపోయింది.మాట్లాడే భాషని,చుట్టూ ఉన్న ప్రపంచాన్ని? భాష అర్థం ఏంటి అన్నది అర్థం కాక తాను ఒక వేరే గ్రహంలో ఉన్నట్లుగా ఫీల్ అయినట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలు చెప్పకు వచ్చింది.

వైద్యులు కూడా ఆమె మూడేళ్ల కంటే ఎక్కువ బతకడం కష్టమని చేతులెత్తేశారు.కానీ అను ఆ మాటలను పట్టించుకోలేదు.తనతో తానే పోరాడింది.నెమ్మదిగా తను మర్చిపోయిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంది.యోగాను ఆశ్రయించింది.చివరికి ఈ పోరాటంలో గెలిచింది.
తన పేరిట అను అగర్వాల్ అనే ఫౌండేషన్ స్థాపించి సేవలందిస్తోంది.







