టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ ఇద్దరు స్టార్ హీరోలకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కలిసి సందడి చేశారు.కారణం ఏంటి అనేది తెలియదు కానీ తాజాగా అమీర్ ఖాన్ హైదరాబాద్ కు రావడంతో అమీర్ ఖాన్ నువ్వు పికప్ చేసుకోవడానికి అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ కి కారు కూడా పంపించారు.
దాంతో అల్లు అర్జున్ అమీర్ ఖాన్ లు ఎందుకు కలిశారు సినిమాల విషయాల పరంగా కలిసారా లేదంటే నార్మల్గా కలిశారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా బ్లాక్ టీ షర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్ లో ఉన్న అమీర్ ఖాన్ ఎయిర్ పోర్టు వద్ద కనిపించగానే అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి.కాగా అమీర్ ఖాన్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లో ఉన్న అల్లు అర్జున్ నివాసం కి వెళ్లినట్లు తెలుస్తోంది.కానీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలయిక వెనుకు కారణం ఏంటీ అనేది మాత్రం తెలియలేదు.
కాగా అమీర్ ఖాన్ హైదరాబాద్ రావడానికి మరో కారణం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.హిందీలో ఎక్కువ సినిమాలు నిర్మించిన మధు మంతెన తండ్రి హైదరాబాద్ లో మరణించారు.
అమీర్ ఖాన్ తో గజనీతో పాటు మరికొన్ని సినిమాలు నిర్మించారు.

అయితే ఆయన్ను పలకరించడానికి అమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చారేమో అని ఎలా ఉంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే గత ఏడాది అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తూ బిజీ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే పుష్ప 2 సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.పుష్ప 2 సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.







