సెన్సార్ పూర్తి.. క్రిస్పీ రన్ టైం లాక్ చేసుకున్న ''ఆదికేశవ''!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్( Panja Vaisshnav Tej ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదికేశవ‘( Aadikeshava ).ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Aadikeshava Wraps Up Its Censor Formalities, Sreeleela, Panja Vaisshnav Tej, Aad-TeluguStop.com

ఎందుకంటే ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.దీంతో ఈ బ్యూటీ వల్ల ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి అనే చెప్పాలి.

ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ( Director Srikanth N Reddy ) తెరకెక్కిస్తున్నాడు.వైష్ణవ్ తేజ్, శ్రీలీల ( Sreeleela ) జోడీని తెరమీద చూడాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ లభించాయి.ఇక ఈ ఇంట్రెస్టింగ్ డ్రామా నుండి రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర అవుతుండడంతో సెన్సార్ కూడా పూర్తి చేసుకుని రన్ టైం లాక్ చేసినట్టు తెలుస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ వారు ఇచ్చినట్టు టాక్.

అంతేకాదు ఈ సినిమాకు 129 నిముషాల రన్ టైం ను లాక్ చేసినట్టు సమాచారం.

ఇదే నిజమైతే ఈ మధ్య కాలంలో 2 గంటల 9 నిముషాల రన్ టైం తో వచ్చిన సినిమాలు లేవు.ఇది క్రిస్పీ రన్ టైం అనే చెప్పాలి.క్లిక్ అయితే సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం.

కాగా ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కాబోతుండగా జివి ప్రకాష్ ( GV Prakash ) సంగీతం ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube