బిగ్ బాస్ సీజన్ 6 తాజాగా సెప్టెంబర్ 4 ఆదివారం రోజున గ్రాండ్ గా మొదలయ్యింది.బిగ్ బాస్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆరోజు రానే వచ్చేసింది.
ఇకపోతే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఏకంగా 20 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.ఎవరికివారుగా అదిరిపోయే పర్ఫామెన్స్ లతో ఒక రేంజ్ లో ఎంట్రీ ఇచ్చారు కంటెస్టెంట్స్.
అయితే ఇందులో కొందరికంటే ఇంతకుముందే పరిచయం ఉండగా మరి కొంతమందికి అందులో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అన్నది కూడా సరిగా తెలియదు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఏవి రూపంలో పరిచయం చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ సీజన్ లో ఎక్కువగా తెలుగు బుల్లితెర సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పవచ్చు.సింగర్ రేవంత్, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, అభినయశ్రీ, ఇంకా నేహా చౌదరి, జబర్దస్త్ చంటి, జబర్దస్త్ ఫైమా, ఇనాయ సుల్తానా ఇలా కాస్త పేరున్న సెలబ్రిటీస్ ఓ 18 మంది బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.
చాలామంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతోనే అదిరిపోయే పెరఫార్మెన్స్ లతో హౌస్ లోకి వచ్చారు.అయితే బిగ్ బాస్ సీజన్ 6 అన్నప్పటి నుండి ఈసారి హౌస్ లోకి సామాన్యుల ఎంట్రీ అంటూ చెబుతూ వస్తున్నారు.

ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు కామన్ పీపుల్స్ ఎంట్రీ ఇచ్చారు.అందులో ఒకరు ఆది రెడ్డి కాగా మరొకరు అరోహి రావు.అయితే వీరు సామాన్యులు అని చెప్పడం కరెక్ట్ కాదేమో.ఎందుకంటే వీరిద్దరూ కూడా యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారే.ఇక ఆదిరెడ్డి బిగ్ బాస్ షోకి రివ్యూస్ ఇస్తూ విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.కాగా ఆదిరెడ్డి ఒక బ్యాంకు ఎంప్లాయ్.
ప్రస్తుతం ఒక యూట్యూబర్ గా దూసుకుపోతున్నాడు ఆదిరెడ్డి.ఇక ఆరోహి విషయానికి వస్తే ఈమె తల్లితండ్రి లేని అమ్మాయి.
ఒంటరి పోరాటం చేస్తూ హైదరాబాద్ కి వచ్చి సినిమా రంగంలో స్థిరపడాలనుకుంటోంది.అలా వీరిద్దరికీ కాస్త కూస్తో ఫాలోయింగ్ ఉంది అని చెప్పవచ్చు.







