తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైంది.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం అన్నట్లుగా కొత్త సీజన్ నిన్న లాంచనంగా ప్రారంభం అయింది.
ఎప్పుడు లేనంతగా ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ ని మొదటి రోజే నాగార్జున హౌస్ లోకి తోలి మొదటి ఎపిసోడ్ కి పేకప్ చెప్పేసి వెళ్ళి పోయాడు.ప్రస్తుతం ఆ 21 మంది సందడి తో బిగ్ బాస్ హౌస్ ఒక రేంజ్ లో ఉండి ఉంటుంది.
ఆ విషయం పక్కన బెట్టితే గత మూడు నాలుగు సీజన్ల కి బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ రికార్డు స్థాయి లో రేటింగ్ దక్కించుకుంది.కానీ ఈసారి ఆ స్థాయి లో రేటింగ్ వచ్చే అవకాశం లేదు అంటూ స్వయం గా నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షో ని ఆశించిన స్థాయి లో ప్రేక్షకులు చూడ లేదని, అందుకు కారణం ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ అంటూ స్టార్ మా కి చెందిన వారు అంటున్నారు.
ఆసియా కప్ లో భాగంగా ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది.ఆ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా హోరా హోరీ గా పోరాడాయి.
చివరికి ఫలితం పాకిస్తాన్ కి అనుకూలం గా వచ్చినా కూడా చివరి వరకు ఉత్కంఠ భరితం గా ఆట కొనసాగింది.దాంతో బిగ్ బాస్ కార్యక్రమం ని ప్రేక్షకులు పూర్తి స్థాయిలో చూడలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.
వారు చెబుతున్నది కనుక నిజమైతే గతం లో వచ్చిన రేటింగ్ లో కనీసం సగం కూడా రేటింగ్ వచ్చే పరిస్థితి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొదటి ఎపిసోడ్ కి ఇంతలా దెబ్బ పడటం తో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ షో నిర్వాహకులు మరియు ప్రేక్షకులు కాస్త టెన్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ షో లో గొడవలు ఉంటే కచ్చితంగా బిగ్ బాస్ ఎప్పటిలాగే మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మళ్లీ శని, ఆదివారాల ఎపిసోడ్ల కోసం ప్రేక్షకులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
త్వరలోనే షో మరింత రసవతరంగా మారుతుందేమో చూడాలి.







