బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు మంచి రేటింగ్స్ రావడానికి హైపర్ ఆది కారణమనే సంగతి తెలిసిందే.హైపర్ ఆది ఎంట్రీ వల్లే జబర్దస్త్ షో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అయిందని చాలామంది భావిస్తారు.
గత కొన్ని వారాలుగా ఆది జబర్దస్త్ షోలో కనిపించడం లేదనే సంగతి తెలిసిందే.జబర్దస్త్ షోకు ఆది దూరమయ్యాడని ఇకపై జబర్దస్త్ లో ఆది కనిపించరని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఆది తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుధీర్ రష్మీ ట్రాక్ ను క్రియేట్ చేసింది నితిన్ భరత్ అని ఈ లవ్ ట్రాక్ వల్లే సుధీర్ రష్మీలకు క్రేజ్ పెరిగిందని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.రేటింగ్స్ గురించి ఆర్పీ మాట్లాడారని ఒక పర్సన్ వల్ల రేటింగ్స్ రావని డైరెక్టర్ తీసుకున్న కంటెంట్ వల్ల రేటింగ్స్ వస్తాయని ఆది తెలిపారు.
నేను జబర్దస్త్ కు గ్యాప్ ఇచ్చానే తప్ప మల్లెమాలకు గ్యాప్ ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నేను నాలుగు సినిమాలలో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్నానని అందువల్ల జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చానని ఆది తెలిపారు.ఈ సినిమాల షూటింగ్ లు పూర్తయ్యాక నేను జబర్దస్త్ తో బిజీ అవుతున్నానని ఆది చెప్పుకొచ్చారు.ఎవరి ప్లేస్ వాళ్లదే అని సుధీర్ ప్లేస్ నేను రీప్లేస్ చేశానని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ఆది తెలిపారు.
ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని ఆది కామెంట్లు చేశారు.
అభి అన్నకు నాకు ఏ గొడవ లేదని ఆది తెలిపారు.
అభి అన్న వల్లే తాను ఇక్కడికి వచ్చానని అయితే అభి అన్నకు కూడా లైఫ్ ఇచ్చింది మల్లెమాల అని ఆది పేర్కొన్నారు.మల్లెమాల వల్లే ఎంతోమంది కొరియోగ్రాఫర్లకు గుర్తింపు వచ్చిందని ఆది వెల్లడించారు.
ఆది చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.