చింపాంజీ తెలివి మామూలుగా లేదుగా.. ఒకేసారి ఎన్ని పండ్లు ఎత్తుకెళ్తుందో చూడండి..

జంతువుల వీడియోలు నెటిజన్లను ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తుంటాయి.ముఖ్యంగా జంతువులు అడవిలో సరదాగా గడపడం లేదా ఏదైనా వింత పనులు చేయడం చూసి అందరూ ఫిదా అవుతుంటారు.

 Funny Chimpanzee Carrying Oranges Wisely Video Viral On Social Media Details, Ch-TeluguStop.com

ఇలాంటి వీడియోలు ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.అయితే తాజాగా ఒక చింపాంజీ ఆహార రవాణా విషయంలో తన తెలివి ప్రదర్శించింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజనులకు వావ్, ఈ చింపాంజీ చాలా ఇంటలిజెంట్ అని కామెంట్లు పెడుతున్నారు.ట్విట్టర్‌లో బ్యూటెంగెబిడెన్ అనే అకౌంట్ ఈ వీడియోని గురువారం షేర్ చేసింది.“మీలో ఎవరు ఇలా చేస్తారు? ” అని ఆ అకౌంట్ దీనికి ఒక క్యాప్షన్ కూడా జోడించింది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక అడవిలో ఒక చింపాంజీ చాలా ఆరంజ్ పండ్లను ఎత్తుకెళ్లడం మీరు గమనించవచ్చు.చింపాంజీ తమ రెండు చేతుల నిండా నారింజ పండ్లు పట్టుకుంది.

అలానే తన పాదాలలో మరిన్ని పండ్లు పట్టుకోగలిగింది.ఇంకొక పండు తన నోటిలో కూడా పెట్టుకుంది.

ఒకేసారి చాలా ఫ్రూప్ట్స్ పట్టుకొని వాటన్నిటినీ తన గూటికి ఎత్తుకెళ్లింది.ఈ క్రమంలో ఈ చింపాంజీ నడవడానికి ఇబ్బంది పడింది, కానీ ఒక్క పండు కూడా కింద పడేయకుండా అన్ని పండ్లను తీసుకువెళ్లగలిగింది.

ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సాధారణంగా చిన్న పిల్లలు ఇలా చేతికి వచ్చిన అన్ని ఫ్రూట్స్ లేదా తినుబండారాలు ఒకేసారి తీసేసుకుంటారు.ఆ సమయంలో తినాలని ఆశ ఎక్కువ వీరికి ఉంటుంది.అందుకే ఏదో కాంపిటేషన్ పెట్టినట్టు వీలైనన్ని ఎక్కువ తీసుకెళ్తారు.

అయితే ఈ చింపాంజీ కూడా అలాగే అధికంగా పండ్లు తీసుకెళ్తూ ఆశ్చర్యపరిచింది.తోటి చింపాంజీల కంటే ఇది ఎక్కువ పండ్లను దోచేసింది.

ఇతర చింపాంజీలు తన దగ్గర ఉన్న ఆరెంజెస్ కొట్టేయకుండా అది జాగ్రత్త పడుతూ చాకచక్యంగా నడుస్తూ వెళ్ళింది.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube