ఇదేందయ్యా ఇదే.. బెల్లం కొనాలంటే ఆధార్ తప్పనిసరా?

రాష్ట్రం నూతన పోకడలకు నంది పలుకుతోంది.అయ్యో అదేంది, బెల్లం కొనాలంటే ఆధార్ వుండాలా? అని నోళ్లు వెళ్ళబెట్టొద్దు, ఆశ్చర్యానికి గురి కావొద్దు.మీరు విన్నది, చదువుతున్నది అక్షరాలా నిజం.బెల్లం కావాలంటే ఇకనుండి మీ ఆధార్ నెంబర్ నమోదు చేసి, తీసుకువెళ్లాలి.అయితే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు వున్నాయి సుమా.కొద్ది మొత్తంలో తీసుకున్నవారికి ఎలాంటి ఆధార్ అడగరు.

 Aadhaar Is A Must If You Want To Buy Jaggery Geggery, Adhar, Card,  Buying, Vira-TeluguStop.com

ఎప్పటిలాగే వారు క్యాజువల్ గా తీసుకెళ్లొచ్చు.ఓ 10 కేజీలు మించి బెల్లం కొనుగోలు చేస్తే గనుక సదరు కస్టమర్ దగ్గర ఆధార్ తో పాటుగా ఫోను నంబరు తీసుకుని తీరాలి అంటున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే, శుక్రవారం అనగా నిన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని రేబాలవారి వీధిలోని సింహపురి వాణిజ్య మండలిలో బెల్లం హోల్సేల్ విక్రయదారులతో సెబ్ నెల్లూరు-1, 2, నవాబుపేట పోలీసులు సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా నాటుసారాని నియంత్రించే భాగంలో పలు సూచనలు చేసారు.

AES S.కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నాటుసారా తయారీదారులకు బెల్లం సరఫరా చేస్తే గనుక కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్తులను హెచ్చరించారు.ఈ సందర్భంగా నాటుసారా తయారీ, విక్రయాలు, అక్రమ రవాణా కట్టడే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు.

Telugu Adhar, Geggery, Latest-Latest News - Telugu

ఇది సంపూర్ణంగా నివారణ కావాలంటే మాత్రం వ్యాపారులు సహకరించాలని కోరారు.పెద్దమొత్తంలో ఎవరన్నా బెల్లం కొనుగోలు చేస్తే గనుక ఆ వివరాలను ప్రతినెల 4వ తేదీలోగా సెబ్ నెల్లూరు-1 స్టేషన్లో అందజేయాలని సూచించారు.ఒకవేళ నాటుసారా తయారీదారులకు వ్యాపారస్తులు సాయం చేస్తే గనుక తాట తీస్తాం అని అన్నారు.

నాటుసారా రహిత జిల్లాగా నెల్లూరును తీర్చిదిద్దేందుకు వ్యాపారులు తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు.ఇక ఈ సమావేశంలో సెబ్ నెల్లూరు-1, 2, జేడీ టీం ఇన్స్పెక్టర్లు కేపీ కిషోర్, వెంకటేశ్వరరావు, హుస్సేన్ బాషా, నవాబుపేట ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube