వావ్, వారానికి ఏడు జాబ్స్‌ చేస్తున్న యూకే యువతి..

చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ వారానికి ఒక్కరోజైనా హాలిడే కోరుకుంటారు, చాలామందికి శని, ఆదివారాల్లో సెలవులు వస్తాయి.ఆ హాలిడేస్‌లో వీరంతా ఎంజాయ్ చేస్తారు.

 A Young Uk Woman Doing Seven Jobs A Week, Kloe Woodroffe, Busy Lifestyle, Multip-TeluguStop.com

కానీ, ఇంగ్లాండ్‌కు చెందిన ఒక యువతి మాత్రం ఎప్పుడూ బిజీగా ఉండటమే ఇష్టపడుతుంది.ఈమె జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆమెకు అస్సలు అలసట రాదు.

ఈ యువతి పేరు క్లోయ్ వుడ్‌రోఫ్.( Chloe Woodroffe ) ఇప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు.

ఆమె ఏకంగా ఏడు ఉద్యోగాలు చేస్తుంది! ఆమె డ్యాన్స్ నేర్పిస్తుంది, కేకులు తయారు చేస్తుంది, సోషల్ మీడియాలో సెలబ్రిటీలా ఉంటుంది, కాఫీ షాప్‌లో పనిచేస్తుంది, పిల్లలను చూసుకుంటుంది, బోటు తీసుకెళ్లి ప్రయాణికులకు మార్గదర్శిగా ఉంటుంది, సబ్‌వే అనే ఫాస్ట్ ఫుడ్ కంపెనీలో( Subway ) కూడా పనిచేస్తుంది.అంటే ఆమె రోజంతా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటుంది.

రీసెంట్ ఇంటర్వ్యూలో క్లోయ్ తన రోజువారీ జీవితం ఎంత బిజీగా ఉన్నా తనకు అలసట రాదని చెప్పింది.తన పనులన్నీ కలిపి నెలకు దాదాపు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తుంది.ఆమె వారానికి ఏడు రోజులు పని చేస్తుంది.“నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఎప్పుడూ బిజీగా ఉండటమే ఇష్టపడతాను.ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండటం మంచిదని నేను అనుకుంటాను!” అని ఆమె చెప్పింది.

ఈ జులైలో మాంచెస్టర్‌లోని నార్తర్న్ బ్యాలెట్ స్కూల్ ( Northern Ballet School, Manchester )నుంచి గ్రాడ్యుయేషన్ చేసింది.

వీకెండ్స్‌లో ఆమె డ్యాన్స్ చేయడానికి, డ్యాన్స్ నేర్పించడానికి సమయం కేటాయిస్తుంది.డ్యాన్స్ చేయనప్పుడు, ఆమె తన పార్ట్‌టైమ్ ఉద్యోగాల్లో ఒకదాన్ని చేస్తుంది లేదా కేకులు తయారు చేస్తుంది.“బేకింగ్ నాకు ఒక రకమైన క్రియేటివ్ హాబీ.నేను కొత్త రెసిపీలు చేసి, వాటిని ఇతరులతో పంచుకోవడం నాకు చాలా ఇష్టం” అని ఆమె చెప్పింది.

Telugu Young Uk Jobs, Busy Lifestyle, Career, Community, Kloe Woodroffe, Multipl

క్లోయ్ రోజు చాలా తెల్లవారుజామున ప్రారంభమవుతుంది.ఆమె ముందుగా కేకులు తయారు చేస్తుంది.ఆ తర్వాత సబ్‌వే లేదా స్థానిక ఫుడ్ స్టాల్ అయిన బోట్ స్ట్రీట్ కేఫ్‌లో పని చేస్తుంది.వారాంతాల్లో ఆమె డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తుంది లేదా పిల్లలను చూసుకుంటుంది.

ఇంతటితో ఆమె పనులు ఆగిపోవు.క్లోయ్ ఇటీవల ఒక చిన్న బోటు కొన్నది.

దాన్ని ఆమె మరమ్మతు చేసి త్వరలో అందులోనే ఉండాలని ప్లాన్ చేస్తోంది.ఇప్పటి వరకు ఆమె తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటుంది.

ఆమె తల్లిదండ్రులు ఆమె పని విధానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.కానీ ఆమె చేస్తున్న పనుల గురించి వారు గర్వపడుతున్నారు.“వారు దీన్ని కొంచెం పిచ్చి అనుకుంటారు, కానీ నేను చేస్తున్న విషయాల గురించి వారు గర్వపడుతున్నారు” అని క్లోయ్ చెప్పింది.

Telugu Young Uk Jobs, Busy Lifestyle, Career, Community, Kloe Woodroffe, Multipl

ఉద్యోగాలు, బోటు మరమ్మతులతో పాటు, క్లోయ్ తన జీవితం గురించి టిక్‌టాక్, యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తుంది.బోటు మరమ్మతులు చేసిన విధానం నుంచి తన రోజువారీ పనుల వరకు అన్నింటినీ ఆమె పంచుకుంటుంది.భవిష్యత్తులో తన సమాజానికి ఏదో ఒక సేవ చేయాలని కూడా ఆమె ఆశపడుతోంది.

ఆమె ఆశయం ఒక సూప్ కిచన్ లేదా ఫుడ్ బ్యాంక్ తెరవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube