ట్రైన్‌లో ప్రయాణిస్తూ స్తంభాన్ని ఢీకొట్టిన యువకుడు.. వీడియో వైరల్!

సాధారణంగా రైల్లో గాని బస్సులో గాని ఇంకా ఏ ప్రజా రవాణా వాహనమైనా సరే డోర్ వద్ద నిల్చోకూడదని ఎప్పుడూ అధికారులు హెచ్చరిస్తుంటారు.సీట్ దొరకకపోతే కాస్త ఆలస్యమైనా సురక్షితమైన ప్లేసు దొరికిన వాహనంలోనే ప్రయాణం చేయాలని సూచిస్తారు.

 A Young Man Traveling On A Train And Hitting A Pole Video Goes Viral , Train, Viral Latest News Viral,danish Hussain Khan, Social Media, Video Viral, Train , Hitting A Pole ,dangerous Place‌-TeluguStop.com

కానీ చాలా మంది తమకు ఏం కాదులే అన్న ధీమాతో డేంజరస్ ప్లేస్‌లలో ప్రయాణాలు చేస్తుంటారు.ఇక యువకులైతే మూర్ఖంగా సాహసాలు చేస్తారు.

డోర్లకు వేలాడుతూ ఒళ్లు గగుర్పొడిచేలా స్టంట్స్ చేస్తుంటారు.ఇలాంటి వారిలో ఇప్పటికే చాలా మంది చచ్చిపోయారు.

 A Young Man Traveling On A Train And Hitting A Pole Video Goes Viral , Train, Viral Latest News Viral,Danish Hussain Khan, Social Media, Video Viral, Train , Hitting A Pole ,Dangerous Place‌-ట్రైన్‌లో ప్రయాణిస్తూ స్తంభాన్ని ఢీకొట్టిన యువకుడు.. వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరొక యువకుడు కూడా చావు వరకు వెళ్లి వచ్చాడు.ప్రస్తుతం ఈ యువకుడికి బొక్కలు విరిగిపోయి నరకం అనుభవిస్తున్నాడు.

ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.

కల్వా, థానే మార్గాల మధ్య వెళ్తున్న ఒక లోకల్ ట్రైన్‌లో డానిష్ హుస్సేన్ ఖాన్ అనే పద్దెనిమిదేళ్ల కుర్రాడు ఎక్కాడు.ఈ ట్రైన్ లో ప్రయాణికులు చాలా ఎక్కువగా ఉండటంతో హుస్సేన్ డోర్ వద్ద ఒక కడ్డీకి వేలాడాడు.

ముందు స్తంభం ఉందని… ట్రైన్‌కు బయటే ఉంటే అది తనని ఢీ కొడుతుందని గమనించలేకపోయాడు.అతడు అలాగే ఇంకా బయటికి వచ్చి షో చేసాడు.

అయితే ఈ లోకల్ ట్రైన్ పక్కనే ప్రయాణిస్తున్న మరొక ట్రైన్ నుంచి ఈ దృశ్యాలను ఒక వ్యక్తి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు.ఇంతలోనే ఒక పెద్ద స్తంభం ట్రైన్ డ్రైవర్ కి వేలాడుతున్న ఆ యువకుడిని బలంగా ఢీకొట్టింది.

అంతే, అతడు క్షణాల్లోనే కిందపడిపోయాడు.కింద రాళ్లపై పడడంతో అతడి బొక్కలు విరిగాయి.

ఈ యువకుడు కాల్వ ప్రాంతంలోని భాస్కర్ నగర్ కు చెందిన నివాసిగా పోలీసులు గుర్తించారు.

గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనలో అతడు తీవ్ర గాయాల పాలయ్యాడు.అదృష్టం కొద్దీ ఈ ప్రయాణికుడిని స్థానికులు గుర్తించి ఛత్రపతి శివాజీ మహారాజ్ సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.అయితే అతడికి కొన్ని ఫ్రాక్చర్లు అయినప్పటికీ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.

పోలీసులు ఈ సంఘటన గురించి మాట్లాడుతూ ఎప్పుడూ కూడా ఇలా ప్రయాణాలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube