భారీ కింగ్ కోబ్రాను కంట్రోల్ చేసిన యువకుడు.. వీడియో వైరల్..

ఏ చిన్న అద్భుతమైన వీడియో తీసిన సోషల్ మీడియాలో వైరల్ అవడం ఈ మధ్యకాలంలో జరుగుతోంది.మనం ఎప్పుడూ ఎక్కడా ఊహించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.

 A Young Brave Boy Controlling King Cobra With Hands Video Viral Details, Young-TeluguStop.com

వీటిలో కొన్ని వీడియోలు నవ్విస్తే, మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని ఆలోచింపజేస్తే, ఇలాంటి మరికొన్ని వీడియోలు బయాన్ని కూడా కల్పిస్తాయి.ఈ భయాన్ని కలిగించే వీడియోలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ వీడియో ఒక కింగ్ కోబ్రా కి సంబంధించింది.

 A Young Brave Boy Controlling King Cobra With Hands Video Viral Details, Young-TeluguStop.com

ఒక చిన్న పాము పిల్ల కనిపిస్తేనే అందరూ భయపడి పరిగెత్తడం మొదలుపెడతారు.

అలాంటిది ఒక భారీ నాగ పాము కనిపిస్తే ఆ ప్రాంతంలో ఎవరూ నిలబడడానికి కూడా సాహసం చేయరు.కానీ ఈ వీడియోలోనీ యువకుడు అందరికంటే భిన్నంగా ఒక భారీ కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా దాన్ని కంట్రోల్ చేసి పట్టుకున్నాడు.

ఈ వీడియోలో జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఒక కింగ్ కోబ్రా వచ్చి ఎటు వెళ్లకుండా నిలబడి ఉంది.దాన్ని పట్టుకోడానికి ఒక యువకుడు అక్కడికి వచ్చి ఎంతో తెలివిగా ఆ పామును కంట్రోల్ చేసేస్తాడు.

మొదటగా ఆ యువకుడు దాని తోక పట్టుకోడానికి ప్రయత్నిస్తే నాగ పాము పూసలు కొడుతూ అతని పైకి దూకుతుంది.అయితే ఈ కింగ్ కోబ్రానీ చాలా తెలివిగా శాంతింప చేస్తూ ఒక్కసారిగా నోటి దగ్గర గట్టిగా పట్టుకుంటాడు.అంతే ఇంకేముంది కింగ్ కోబ్రా ఆ యువకుడి కంట్రోల్లోకి వచ్చినట్టే.ఆ తర్వాత ఆ యువకుడు కింగ్ కోబ్రా ను దగ్గరలోని అడవి ప్రాంతంలో విడిచి పెట్టాడు.

ప్రస్తుతం ఈ యువకుడు చేసిన సాహసం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube