భారీ కింగ్ కోబ్రాను కంట్రోల్ చేసిన యువకుడు.. వీడియో వైరల్..

ఏ చిన్న అద్భుతమైన వీడియో తీసిన సోషల్ మీడియాలో వైరల్ అవడం ఈ మధ్యకాలంలో జరుగుతోంది.

మనం ఎప్పుడూ ఎక్కడా ఊహించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.వీటిలో కొన్ని వీడియోలు నవ్విస్తే, మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని ఆలోచింపజేస్తే, ఇలాంటి మరికొన్ని వీడియోలు బయాన్ని కూడా కల్పిస్తాయి.

ఈ భయాన్ని కలిగించే వీడియోలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ వీడియో ఒక కింగ్ కోబ్రా కి సంబంధించింది.ఒక చిన్న పాము పిల్ల కనిపిస్తేనే అందరూ భయపడి పరిగెత్తడం మొదలుపెడతారు.

అలాంటిది ఒక భారీ నాగ పాము కనిపిస్తే ఆ ప్రాంతంలో ఎవరూ నిలబడడానికి కూడా సాహసం చేయరు.

కానీ ఈ వీడియోలోనీ యువకుడు అందరికంటే భిన్నంగా ఒక భారీ కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా దాన్ని కంట్రోల్ చేసి పట్టుకున్నాడు.

ఈ వీడియోలో జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఒక కింగ్ కోబ్రా వచ్చి ఎటు వెళ్లకుండా నిలబడి ఉంది.

దాన్ని పట్టుకోడానికి ఒక యువకుడు అక్కడికి వచ్చి ఎంతో తెలివిగా ఆ పామును కంట్రోల్ చేసేస్తాడు.

"""/"/ మొదటగా ఆ యువకుడు దాని తోక పట్టుకోడానికి ప్రయత్నిస్తే నాగ పాము పూసలు కొడుతూ అతని పైకి దూకుతుంది.

అయితే ఈ కింగ్ కోబ్రానీ చాలా తెలివిగా శాంతింప చేస్తూ ఒక్కసారిగా నోటి దగ్గర గట్టిగా పట్టుకుంటాడు.

అంతే ఇంకేముంది కింగ్ కోబ్రా ఆ యువకుడి కంట్రోల్లోకి వచ్చినట్టే.ఆ తర్వాత ఆ యువకుడు కింగ్ కోబ్రా ను దగ్గరలోని అడవి ప్రాంతంలో విడిచి పెట్టాడు.

ప్రస్తుతం ఈ యువకుడు చేసిన సాహసం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

బీజేపీ ఎవరికీ బీ -టీమ్ కాదు..: కిషన్ రెడ్డి