తెలంగాణ ప్రగతిశీల హమాలి అండ్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్టియు అనుబంధం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖమ్మం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రం నుండి జిల్లా లేబర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించిన అనంతరం బీసీల ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కార్యాలయం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కు అందించడం జరిగింది .అనంతరం హమాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు కే శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల హమాలియన్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
డి.శ్రీనివాసరావు.ఐ ఎఫ్ .టి .యు.ఖమ్మం జిల్లా కార్యదర్శి జి రామయ్య లు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత శ్రమజీవులకు నేడు బతుకు భద్రత లేదని సామాజిక భద్రత లేదని ఉత్పత్తి పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న హమాలి అండ్ మిల్ వర్కర్స్ పనులు నిలిపివేస్తే ఎక్కడ సరుకులు అక్కడే ఉండిపోతాయని ప్రజల వద్దకు సరుకులు చేరకపోతే పరిస్థితులు తీవ్ర సంక్షోభంగా మారుతాయి అని అలాంటి ముఖ్యమైన పాత్ర పోషించే శ్రమజీవులకు కనీస సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 600 రైస్ మిల్లు ,మార్కెట్ ,వ్యవసాయ, ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల్లో పట్టణ ప్రాంతాల్లో దుకాణాలలో సివిల్ సప్లై ఎఫ్సీఐ గోడౌన్ ట్రాన్స్పోర్ట్ మరియు పరిశ్రమలలో లక్షల మంది హమాలీ అండ్ మిల్ వర్కర్స్ పనిచేస్తున్నారని వారందరూ లక్ష్యమైన అసంఘాతరంగ కార్మిక సామాజిక భద్రత చట్టం ఏర్పాటు చేయాలని సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పని భద్రత కల్పించాలని అర్హులైన ప్రతి హమాలీ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించి డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని వివిధ సంస్థల పని చేస్తున్న హమాలీ కార్మికులందరికీ ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని తదితర డిమాండ్స్ సాధనకై కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల హమాలియన్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు.కే శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు బి రమేష్ జిల్లా సహాయ కార్యదర్శి కే పుల్లారావు జిల్లా కార్యవర్గ సభ్యులు.జె.రాంబాబు బి సత్యం.ఆర్ సీతయ్య.
ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి ఏ అశోక్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే లాల్మియా తదితరులు పాల్గొన్నారు.