గాజా కేంద్రంగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకరపోరు

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.ప్రతికార దాడులతో గాజా కేంద్రంగా ఇజ్రాయెల్ మరణహోమం సృష్టిస్తోంది.

 A Violent Conflict Between Israel And Hamas Centered On Gaza-TeluguStop.com

క్షిపణులు, బాంబుల దాడులతో ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు అక్కడి ప్రజలు ఆహారం లేక విలవిలలాడుతున్నారు.పూర్తిగా హమాస్ ఆధీనంలో ఉన్న గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది.

గాజాను అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయెల్ ఆహారం, నీళ్లు, కరెంట్, ఇంధనం సహా నిత్యావసరాలన్నీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.దీంతో ప్రస్తుతం గాజాలో తీవ్ర భయానక మరియు విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కాగా ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సుమారు తొమ్మిది వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు.గాజాలో జర్నలిస్టులను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలి పెట్టడం లేదని తెలుస్తోంది.

మరోవైపు ఇజ్రాయెల్ కు హమాస్ హెచ్చరికలు జారీ చేసిందని తెలుస్తోంది.బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను హతమారుస్తామని హమాస్ చెబుతోంది.

అయితే దీనిపై హమాస్ ను నిర్మూలించి యుద్ధాన్ని ముగిస్తామని ఇజ్రాయెల్ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube