తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్లు సంచారం వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది.స్వామివారి ఆలయంపై డ్రోన్లు ఎగిరినట్లు స్పష్టమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.
ఈ వివాదంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆస్థాన మండపం వద్ద ఉన్న రోడ్డుపై నుంచి డ్రోన్లను ఉపయోగించినట్లు సమాచారం.
కాకులకోన వద్ద సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వీడియోలు తీసేందుకు గత ఏడాది టీటీడీ అనుమతి ఇచ్చింది.ఆ సమయంలోనే డ్రోన్ ఆపరేటర్ శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు.







