గుజరాత్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందారు.
నవ్ సారి జిల్లాలో బస్సును కారు ఢీకొట్టింది.ప్రమాదంలో 32 మందికి గాయాలు అయ్యాయి.
వెంటనే గుర్తించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.