వెస్టిండీస్( West Indies ) పర్యటనలో భాగంగా తాజాగా జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆరంగేట్రం చేశాడు.ఐపీఎల్ గత రెండు సీజన్లో ముంబై ఇండియన్స్ కి ఆడిన తిలక్ వర్మ, తన మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్లో ఏకంగా రెండు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు.
వెస్టిండీస్ బ్యాటర్ చార్లెస్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడెందుకు ప్రయత్నించి తిలక్ వర్మ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.తిలక్ వర్మ( Tilak Varma ) దాదాపుగా 10 మీటర్ల దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి డ్రైవ్ చేస్తూ కళ్ళు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.

ఇక నికోలస్ పూరన్ కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి తిలక్ వర్మ చేతికి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.దీంతో సురేష్ రైనా తర్వాత ఆరంగేట్రం టీ20 మ్యాచ్ లో రెండు క్యాచ్లు అందుకున్న భారత క్రికెటర్ గా తిలక్ వర్మ నిలిచాడు.ఫీల్డింగ్ లో అద్భుత ఆటను ప్రదర్శించిన తిలక్ వర్మ బ్యాటింగ్ లోను తన సత్తా ఏంటో చాటాడు.తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
మొదటి బంతి డాట్ బాల్ గా ఆడిన తిలక్ వర్మ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు.</b

తిలక్ వర్మ 22 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.దీంతో 20 ఏళ్ల వయసులో ఒకే టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా నిలిచాడు.గతంలో రోహిత్ శర్మ( Rohit Sharma ) 2007లో సౌత్ ఆఫ్రికాపై, 2019లో వాషింగ్టన్ సుందర్ బంగ్లాదేశ్ పై రెండేసి సిక్సర్లు బాదారు.ఆరంగేట్రం మ్యాచ్లో 175కి పైగా స్ట్రైక్ రేటుతో 30కి పైగా పరుగులు చేసిన మూడవ భారతీయ బ్యాటర్ గా తిలక్ వర్మ నిలిచాడు.టీ20 ఆరంగేట్రం మ్యాచ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఎనిమిదవ భారతీయ బ్యాటర్ గా తిలక్ వర్మ నిలిచాడు.







