మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఇంటికి మూడో తరం వారసురాలు అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) ఉపాసన( Upasana ) దంపతులకు వివాహం జరిగి 11 సంవత్సరాలు అయిన తర్వాత ఈ దంపతులకు ఆడబిడ్డ జన్మించారు.
ఈ చిన్నారి జూన్ 20వ తేదీ జన్మించడంతో మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక చిన్నారి పుట్టిన తర్వాత చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిన్నారి జాతకం అద్భుతంగా ఉందని అద్భుతమైన గడియలలో పాప జన్మించింది అంటూ చెప్పుకొచ్చారు.
ఇక చిన్నారి రాకతో మా ఇంట్లో అన్ని శుభ పరిణామాలు జరుగుతున్నాయని చిరంజీవి వెల్లడించారు.

పాప కడుపులో ఉండగానే ఈ విజయాలన్నీ మా ఇంటికి ఒక్కొక్కటి వస్తున్నాయని చిరు తెలిపారు రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఇలా శుభవార్తలే వింటున్నామని తెలిపారు.ఇక పాప జాతకాన్ని పలువురు జ్యోతిష్యులు చెబుతూ పాప జాతకంలో రాజయోగం ఉందని తండ్రి తాతను మించి కీర్తి ప్రతిష్టలు అందుకుంటుందని చిన్నారి జాతకం గురించి కూడా పలువురు జ్యోతిష్యులు తెలిపారు.అయితే మెగా ఇంట్లోకి క్లిన్ కారా ( Klin Kaara ) పుట్టిన వేళా విశేషం ఏంటో కానీ మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 20 వేల కోట్ల రూపాయల లాభాలు పొందారని తెలుస్తోంది.
ఇలా మెగాస్టార్ చిరంజీవి ఇంత లాభం పొందటానికి కారణమేంటి అనే విషయానికి వస్తే.

కోకాపేట్ ( Cokapet ) భూమి విలువ ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం మనకు తెలిసిందే ఏకంగా ఎకరం భూమి విలువ 100 కోట్ల రూపాయలు పలుకుతుంది దీంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా కోటీశ్వరులుగా మారిపోయారు అయితే కోకాపేట్ లోమెగాస్టార్ చిరంజీవికి కూడా భూమి ఉందని తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కోకాపేట్ లోచిరంజీవికి ఏకంగా 30 ఎకరాల పొలం ఉందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఇలా అక్కడ 30 ఎకరాల పొలం ఉండడంతో ధరలు అమాంతం పెరగటం వల్ల చిరంజీవి భారీగానే లాభం పొందారని ఇదంతా కూడా తన ఇంటికి తన వారసురాలు వచ్చిన వేలా విశేషమేనని ఈ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.







