మూఢ నమ్మకం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.ఈ విషాద ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో( Kadapa ) చోటు చేసుకుంది.
రాజుపాలెం మండలం కులూరు గ్రామానికి సమీపంలో ఉన్న కుందు నదిలో ముగ్గురు మునిగారు.నది లోతుగా ఉండటంతో ఇద్దరు వ్యక్తులు నీట మునిగి మృత్యువాతపడ్డారు.
మృతులు నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన షేక్ ఇమామ్ బీ, ఫకీర్ మస్తాన్ ( Sheikh Imam Bei, Fakir Mastan )లుగా గుర్తించారు.అయితే షేక్ ఖాజా హుస్సేన్ ఆయన సతీమణి షేక్ ఇమామ్ బీ, బావమరిది ఫకీర్ మస్తాన్ లు ఎర్రగుంట్లలోని దర్గాకు వెళ్లారు.
షేక్ ఇమామ్ బీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో దర్గాలో ప్రార్థనలు చేశారు.ఈ క్రమంలోనే కుందునదిలో మునిగితే ఆమె ఆరోగ్యం బాగు పడుతుందని దర్గాలోని బాబా చెప్పాడని తెలుస్తోంది.
దీంతో కుందు నదిలో ముగ్గురు మునగగా.ఇద్దరు మృత్యువాతపడ్డారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







