పెళ్లిళ్లుకు సంబంధించి వరల్డ్ వైడ్ గా వింత వింత ఆచారాలు ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా వివాహానికి సంబంధించి రకరకాల ఆచారాలు, వింత సంప్రదాయాలు ఉన్నాయి.
ముఖ్యంగా పెళ్లిళ్లలో రిటర్న్ గిఫ్ట్ అనేది కామన్‌గా ఉంటుంది.పెళ్లికి వచ్చినవారికి ఏదొకటి రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చి పంపిస్తూ ఉంటారు.
దుస్తులు లేదా ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులను పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు.అలాగే అతిథులు ఆహ్వానించినవారికి గిఫ్ట్‌లు తీసుకెళుతూ ఉంటారు.

అయితే తాజాగా పెళ్లిలో వింత ఆచారం ఒకటి వెలుగులోకి వచ్చింది.వధువును వరుడు కలవాలంటే పెద్ద అగ్నిపరీక్ష తప్పదు.పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఊరేగింపులో వింత ఆచారం పాటిస్తారు.పెళ్లి కూతురిని చూడాలంటే తమకు సిగరెట్లు, డబ్బులు( Cigarettes, money ) ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తారు.
అవి ఇచ్చేంతవరకు పెళ్లి కూతురిని ( bride )కలిసేందుకు పెళ్లి కొడుక్క అనుమతి ఇవ్వరు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ( South China Morning Post )అనే పత్రిక ఈ వింత ఆచారం గురించి ఒక కథనం రాసింది.
చైనాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ వింత ఆచారం పాటిస్తున్నారు.

సాంప్రదాయం ప్రకారం గ్రామస్తులను సంతృప్తి పరచడంలో వరుడు విఫలమైతే వధువును కలుసుకోవడంలో బాగా ఆలస్యం అవుతుంది.ఒక్కొసారి పూర్తిగా పెళ్లినే నిరాకరించే అవకాశాలు కూడా ఉంటాయి.వరుడి మార్గాన్ని అడ్డుకునే ఈ పద్ధతిని మాండరిన్‌లో లాన్ మెన్( Lawn Men in Mandarin ) అని పిలుస్తారు.
దీని అర్థం “తలుపును అడ్డుకోవడం” అని చెబుతున్నారు.తాజాగా చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైజౌలోని ఒక గ్రామంలో వరుడికి చేదు అనుభవం ఎదురైంది.వధువును కలుసుకునేందుకు వెళ్లే క్రమంలో గ్రామస్తులందరూ వరుడిని అడ్డుకున్నారు.డబ్బులు, సిగరెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అక్కడ ఉన్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది
.






