బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) గురించి తెలియని సినీ లవర్ ఉండరు.ఈయన ఇండియా వైడ్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన స్టార్ హీరోల్లో ఒకరు.
మరి అలాంటి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ రోజు పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.ఈ క్రమంలోనే ఈయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
ఈయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.సెలెబ్రిటీలు సైతం ఈయనతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక షారుఖ్ ఖాన్ కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి.ఎందుకంటే ఒకే ఏడాది రెండు సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

చాలా గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో వచ్చిన షారుఖ్ కు అదిరిపోయే హిట్ లభించడమే కాకుండా 1000 కోట్ల క్లబ్ లో కూడా చేరి బాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేసాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో మరో సినిమాను చేసాడు.ఇటీవలే సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇది కూడా మరో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ గా నిలిచింది.

సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార ( Nayanthara ) హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనె ( Deepika Padukone )కూడా కీలక రోల్ లో నటించింది.ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో అలరించడానికి సిద్ధం అయ్యింది.
ఈ రోజు ఈయన పుట్టిన రోజు కానుకగా నవంబర్ 2 నుండి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.ఈ రోజు అర్ధరాత్రి నుండి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
అంతేకాదు ఈ సినిమాలో డిలేట్ చేసిన సీన్స్ ను కూడా యాడ్ చేసినట్టు చెప్పి మంచి సర్ప్రైజ్ ఇచ్చారు.థియేటర్స్ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటిటిలో ఎలా అలరిస్తుందో చూడాలి.
ఇదిలా ఉండగా ఈ ఏడాది షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో డిసెంబర్ 21న మరోసారి ఆడియెన్స్ ను పలకరించ బోతున్నాడు.ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.