సౌత్ కరోలినాలో వింత జీవి కలకలం... షాక్ అవుతున్న ఎక్స్‌పర్ట్స్‌..

తాజాగా అమెరికాలోని సౌత్ కరోలినా( South Carolina ) నీళ్లలో ఓ వింత జీవి ఈత కొడుతూ కెమెరాకు చిక్కింది.దీనిని చూసి నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

 A Strange Creature In South Carolina Shocked Experts, Unidentified Animal, South-TeluguStop.com

ఈ వింత జీవిని పావ్లీస్ ద్వీపంలోని ఒక వంతెన దగ్గరకు వెళ్లిన స్థానికుడు తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు.అబ్బురపరిచే ఈ ఫుటేజీని టీవీ స్టేషన్‌కు సెండ్ చేసాడు.

టీవీ వారి సైతం ఈ జీవి ఏంటో తెలియక తల గీక్కున్నారు.తర్వాత వారు ఆ వీడియోను సౌత్ కరోలినా డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్( Department of Natural Resources ) (DNR)కి కోసం ఫార్వార్డ్ చేశారు.

DNR ప్రతినిధి దీనిని చూసే తాను స్టన్ అయ్యానని చెప్పుకొచ్చారు.సహాయం కోసం నిపుణులను సంప్రదించారు.అయితే ఈ జీవి ఏంటనేది ఎవరూ కూడా గుర్తించలేకపోయారు.చివరికి ఈ వీడియోను విశ్లేషణ కోసం చార్లెస్టన్‌లోని మెరైన్ రిసోర్సెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు.

తర్వాత ఒక నిపుణుడు ఈ వీడియో ఫుటేజ్ ని అందుకున్నారు.ఆ జీవిని సముద్రపు కుందేలు లేదా సీ స్లగ్‌గా ఆయన గుర్తించాడు.

సీ స్లగ్‌ సాధారణంగా చాలా పెద్దదిగా ఉంటుంది, ఇది నీటిలో ఈదుతుంది.

అయినప్పటికీ, ఈ జాతిని దక్షిణ కరోలినా జలాల్లో కనుగొనడం అసాధారణం.ఎందుకంటే అవి సాధారణంగా ఫ్లోరిడా లేదా వెస్ట్ కోస్ట్‌లో( Florida or the West Coast ) కనిపిస్తాయి.వెచ్చని జలాల కారణంగా ఈ సముద్రపు స్లగ్‌లు ఈ ప్రాంతానికి వలస వచ్చి ఉండవచ్చని నిపుణులు ఊహించారు.

WCNC అనే యూట్యూబ్ ఛానల్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క జీవి పేరు చెబుతున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube