తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్( CM kcr ) వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఒకటి గజ్వేల్ కాగా మరోటి కామారెడ్డి.
ఈ రెండు నియోజిక వర్గాల్లో కేసిఆర్ తిరుగులేని విజయం సాధిస్తారని బిఆర్‌ఎస్ బలంగా నముతోంది.అయితే ఆయనకు గజ్వేల్ లో ఈసారి ఓటమి తప్పదా ? అంటే అవునేమో అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.2014 మరియు 2018 ఎన్నికల్లో కేసిఆర్ గజ్వేల్( Ghazwal ) నుంచే పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందారు.అయితే ఈసారి మాత్రం నియోజిక వర్గంలో సొంత పార్టీ నేతలే కేసిఆర్ కు వ్యతిరెకంగా పావులు కదుపుతున్నట్లు వినికిడి.

పేరుకు సిఎం అయినప్పటికి నియోజికవర్గ ప్రజలకు కేసిఆర్ఎప్పుడు అందుబాటులో లేరని, ఉద్యమకారులను సిఎం విస్మయించారని, పార్టీ కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని గజ్వేల్ నియోజిక వర్గంలోని బిఆర్‌ఎస్ శ్రేణులు వాపోతున్నారట.దాంతో ఈ అసమ్మతి నేతలంతా కేసిఆర్ ప్రత్యర్థి వర్గానికి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.గజ్వేల్ లో కేసిఆర్ ( CM kcr )కు పోటీగా బీజేపీ ( BJP )నుంచి ఈటెల రాజేంద్ర పోటీ చేయనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈటెల రాజేంద్ర ( Eatala Rajender )కూడా కేసిఆర్ తో పోటీకి తాను సిద్దమని చాలా సందర్భాల్లో స్పష్టతనిచ్చారు.

అందువల్ల కేసిఆర్ తో ఢీ కొట్టేందుకు ఈటెల సిద్దమే అని తెలుస్తోంది.ఇప్పుడు బిఆర్‌ఎస్( BRS ) లోని అసమ్మతి నేతలంతా కూడా ఈటెల వెంట నడనాలని చూస్తున్నారట.ఈ పరిణామాలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి.గజ్వేల్ లో ఓటమిని ముందుగానే అంచనా వేసిన కేసిఆర్ కామారెడ్డిని కూడా ఎంచుకున్నారని గత కొన్నాళ్లుగా నడుస్తున్న గుసగుసలు.నిజంగానే కేసిఆర్ ఓడిపోయేంత వ్యతిరేకత గజ్వేల్ లో ఉందా ? అంటే చెప్పలేమనే సమాధానాలు వినిపిస్తున్నాయి.ఒకవేళ కేసిఆర్ ఓడిపోతే బిఆర్‌ఎస్ చరిత్రలోనే అదొక మచ్చల మిగిలి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఏం జరుగుతుందో చూడాలి.