గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ( BJP MLA Rajasingh )కు ఎదురుదెబ్బ తగిలింది.హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినప్పటికీ బీజేపీ( BJP ) ఎల్పీలో ఆయనకు చోటు దక్కలేదు.
బీజేపీఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు.అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పాయల్ శంకర్, వెంకట రమణారెడ్డితో పాటు బీజేపీ చీఫ్ విప్ గా పాల్వాయి హరీశ్, విప్ గా ధన్ పాల్ సూర్యనారాయణ నియమితులయ్యారు.
బీజేపీఎల్పీ ట్రెజరీగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి నియామకం చేస్తూ పార్టీ ప్రకటించింది.