వైరల్: అతను గత పదేళ్లుగా తన కుడిచేయిని పైకిలేపే ఉంచాడు... ఎందుకని చెబితే దానికోసమే అంటున్నాడు!

మీరు ఆశ్చర్యపోతున్నా ఇది అక్షరాలా నిజం.మీలో ఎవరైనా ఓ గంటసేపు చేతిని పైకెత్తి ఉంచితే బోలెడంత డబ్బు ఇస్తామన్నా ఆ ధైర్యం చేయలేరు.

 A Saint Kept His Right Hand Raised For The Past Ten Years Viral Details, 10 Year-TeluguStop.com

ఎందుకంటే అది అసాధ్యం కనుక.కానీ, ఓ సాధువు మాత్రం గత 10 సంవత్సరాలుగా తన కుడిచేతిని పైకెత్తే వుంచుతున్నాడు.

నేటికీ అతని కుడిచేయి అలాగే పైకెత్తే ఉంటుంది.రాత్రి నిద్రపోయే సమయంలో కూడా చేయి పైకెత్తే ఉంటుందట.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సదరు సాధువును.

ఓ రిపోర్టర్ ఇంకెన్నాళ్లు ఇలా చేయి పైకెత్తి ఉంచుతారు అని ప్రశ్నించాడు.దానికి అతను చాలా గమ్మత్తైన సమాధానం చెప్పుకొచ్చాడు.

అదేమిటంటే, తాను గత 10 సంవత్సరాలుగా చేతిని పైకెత్తి ఉంచుతున్నానని, అయితే ఇంకెన్నాళ్లు వుంచుతాడో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు.అలా తనకు సాధ్యమైనంత వరకు చేతిని పైకెత్తే ఉంచుతానని తెలిపాడు.

అలాగే తాను నిద్రపోయేటప్పుడు కూడా చేతిని పైకే ఉంచుతానని, ఆ సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలిగినట్లు అనిపించదని ఆ సాధువు తెలిపాడు.అయితే, సాధువు తన చేయి తిమ్మిరిగా అనిపించినప్పటికీ ఎడమ చేతితో వివిధ పనులను పూర్తి చేసుకుంటున్నాడు.

ఇదిలాఉంటే.ఇలా చేయి పైకెత్తి ఉండటం ఈ సాధువే మొదటి వ్యక్తి కాదట.

అమర్ భారతి అనే మరొక వ్యక్తి తన జీవితమంతా శివుడికి అంకితం చేయడానికి 45 సంవత్సరాలకు పైగా తన చేయిని పైకెత్తే ఉంచాడని యూనిలాడ్ నివేదిక వివరించింది.

అయితే ప్రస్తుతం అతని రికార్డును మీరు బ్రేక్ చేయాలనుకుంటున్నారా? అని రిపోర్టర్ సాధువును ప్రశ్నించగా.తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకెత్తే ఉంచుతానని సమాధానం ఇచ్చాడు.ఈ విషయంపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇంతకాలం చేతిని పైకెత్తి ఉండటం తనకు నమ్మశక్యంగా లేదని, నేను నా చేతిని పైకెత్తి గంటసేపు ఉంచలేకపోయానని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.మరో నెటిజన్.బహుశా తన కుడి చేతిని సాధువు ఒక సెకను పాటు కిందకు దించి ఉంటాడని చమత్కరించారు, దానికి మరో నెటిజన్ ఇలా సమాధానమిచ్చాడు!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube