తెలంగాణలో ఇప్పటికే ఎడతెరిపిన ఎడతెరిపి లేని వర్షాలతో తడిచి ముద్దవుతున్న తెలంగాణ ను మరో పొలిటికల్ తుఫాను ముంచెత్తనుందని ముందస్తు వార్తలు వస్తున్నాయి.మరో నాలుగు ఐదు నెలల్లోనే ఎన్నికలు ఉన్నందున రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లుగా తెలుస్తుంది ఇందులో కాంగ్రెస్ ( Congress party )అధికార బారాస పార్టీలు ముందంజలో ఉండగా భాజపా కొద్దిగా వెనకబడిందని వార్తలు వస్తున్నాయి .
ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడ్ని మార్చడం, కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడడంతో ఎన్నికల సంగ్రామంలో భాజపా కొద్దిగా వెనుకబడినట్లుగా కనిపించింది .అయితే ఇది తాత్కాలిక విరామమేనని మరింత బలంగా భాజపా( BJP party ) తెలంగాణ రాజకీయాల్లోకిదూసుకు రాబోతుందని వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి.
మరికొద్ది రోజుల్లో తెలంగాణ బాజాపా ల్ లోకి దాదాపు 15 మంది మాజీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు చేరబోతున్నారని, ఇందులో ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉంటారని, ఈ దిశగా కీలక మంతనాలు జరుగుతున్నాయని తెలంగాణ మీడియా ఛానల్స్ లో వార్తలు ప్రసారం అవుతున్నాయి.దీని వెనక ఇటీవల భాజపాలో చేరిన ఒక మాజీ ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆయన తన పాత పరిచయాలతో ఈ నేతలను పార్టీ వైపుగా ఆకర్షిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి .ఇందులో కాంగ్రెస్ నేతలతో పాటు అధికారంబి ఆర్ఎస్( BRS party ) నేతలు కూడా ఉన్నారని పార్టీలో సీటుపై తగిన హామీ రాకపోవడంతో పాటు పార్టీలకు గుర్తింపు సంబంధించి అసంతృప్తి తో ఉన్న కొద్ది మంది నేతలకు భాజపా ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టిందని మరి కొద్ది రోజుల్లోనే భారీగా చేరికలు ఉంటాయని ఆ వార్తల సారాంశం.
ఆ చేరికల తర్వాత తెలంగాణ భాజపా కార్యకర్తల్లో మళ్ళీ ఊపు వస్తుందని, రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సంసిద్ధమవుతామని తెలంగాణ భాజపా విశ్వాసం వ్యక్తం చేస్తుంది.మరి ఆ పార్టీ ఏ స్థాయిలో వలసలు ఆకర్షించగలుగుతుందో మరి కొద్ది రోజుల్లో ఒక అంచనాకు రావచ్చు
.