బీజేపీ పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ప్రభంజనం బలంగావీస్తుంది.తెలుగు రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే గతి అనే అభిప్రాయాలకు చెక్ పెడుతూ మోదీ టూర్ ఓ ప్రభంజనం లా సాగింది.

 A New Josh In The Ranks Of The Bjp Party , Bjp Party , New Josh  , Prime Ministe-TeluguStop.com

తెలంగాణలో టీఆర్ ఎస్, ఏపీలో వైపీపీ లేదా టీడీపీ అనే అపోహాలకు మోదీ టూర్ ఒక బిగ్ సమాధానంగానే నిలిచిందంటున్నారు విశ్లేషకులు.తెలంగాణాలో మోదీటూర్ ఓ ప్రభంజనాన్ని సృష్టించగా, ఇపుడు ఏపీలోనూ అదేజోష్ కనిపించింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన ఓ సుడిగాలిలాగే కొనసాగింది.ఇంతవరకూ ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలకుదిక్కనుకునే అపోహలకు మోదీ టూర్ చెక్ పెట్టిందంటున్నారు బీజేపీ నేతలు.

దాంతో అటు తెలంగాణాలోనూ, ఇటు ఏపీలోనూ బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందనే చెప్పాలి.

ముఖ్యంగా తెలంగాణలో పఠించిన మేక్ ఇన్ ఇండియా, సబ్ కా సాథ్, .సబ్ కా వికాస్ లాంటి మంత్రాలను ఏపీలోనూ పఠించారు.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ప్రధాని మోదీ గత శని, ఆదివారాలు హైదరాబాద్ లోనే గడిపారు.

ఇక్కడ స్థానిక నేతలకు, ప్రముఖులకు ప్రత్యేక దర్శనాలిచ్చిన మోదీ ఇక్కడి ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.మరోవైపు తెలంగాణాలో బీజేపీ స్టేండ్ పై, కార్యకర్తలు, నేతలు తీసుకుంటున్న చర్యలపైనా అడిగితెలుసుకున్నారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన విధి విధానాలపైనా బండిసంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనూ ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం.ఎట్టి పరీస్థితుల్లోనూ తెలంగాణలో కమలం విరబూయాలంటూ పార్టీ శ్రేణులకు దిశ నిర్ధేశం చేసినట్లు సమాచారం.

అదే జోష్ తో ప్రధాని మొదీ తన ఏపీ పర్యటనను కొనసాగించారు.మరోవైపు ఏపీ భీమవరంలో అడుగు పెడుతూనే మన్యం మహావీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కారించారు.

ఒదశలో ఇక్కడ బీజేపీ కార్యకర్తల్లో సందడిలో బీజేపీకి సరికొత్త జోష్ పుట్టుకొచ్చింది.ఏపీకి రాబోతున్న ప్రధానికి స్వాగతం పలకడానికి అతిరధ మహారధులందరూ వచ్చారు.

అదేవిధంగా వీడ్కోలు సందర్భంగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తోపాటు సీఎం జగన్ కూడా వచ్చారు.

Telugu Ap Bhimavaram, Bjp, Josh, Prime Modi, Prime Modis, Sitaramarajas-Politica

ఏపీలో తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగంలో వీర భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తు న్నానంటూ ప్రారంభించారు.పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ ఏపీలో ప్రజల మనసులను దోచుకునే ప్రయత్నం చేసారు మోదీ.ముఖ్యంగా మన్యం మహావీరుడు అల్లూరి సీతా రామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ మన్యం వీరుడు తెలుగు జాతి యుగ పురుషుడని అభివర్ణించారు.

అల్లూరి సీతా రామరాజు నడిచిన నేలపై నేను నడవడం నా అదృష్టంగాభావిస్తున్నానన్నారు.యావత్ భారతానికి అల్లూరి స్ఫూర్తిగా నిలిచారన్నారు.రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తైందన సందర్భంగా, స్ఫూర్తి కోసమే ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.మొగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని ప్రకటించడంతో కార్యకర్తల చప్పట్లతో ఈప్రాంతమంతా మారుమ్రోగింది.ఈ నేపథ్యంలోనే ఎందరో మహాను భావులు దేశం కోసం త్యాగాలు చేశారని, త్యాగధనులను స్మరించుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

మన్యం వీరుడిగా ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారని గుర్తుచేశారు.ఆనాడు బ్రిటిష్‌కు వ్యతిరేకంగా యువకులు మన్యవ వీరుడితో పోరాటంలో చేతులు కలిపారన్నారు.

అదేవిధంగా దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలాషించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube