ప్రముఖ సోషల్ మీడియా( Social media ) ఫ్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.ఇకపై ఇంస్టాగ్రామ్ యాప్ లో ఫాలోవర్లు ఫోటోలు, వీడియోలు, రీల్స్ షేర్ చేసుకోవచ్చు.
ఇంస్టాగ్రామ్( Instagram ) తమ యూజర్ల కోసం కొన్ని ప్రత్యేక అడ్వాన్స్డ్ ఆప్షన్లను పరిచయం చేయనుంది.ఆ ఆప్షన్లలో ఒకటే రీల్స్, పోస్టులు షెడ్యూల్ చేసే ఆప్షన్.
ఈ ఆప్షన్ ఎలా ఉపయోగించు కోవాలంటే.ఇంస్టాగ్రామ్ యాప్ లో ముందుగా + అనే ఐకాన్ క్లిక్ చేయాలి.
ఆ తరువాత షెడ్యూల్ చేయాలనుకుంటున్న కంటెంట్ టైప్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి.

ఒకవేళ మీరు రీల్స్( Instagram reels ) లేదా పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే.గ్యాలరీ లేదా కెమెరా నుంచి షేర్ చేయాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోను సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత నచ్చిన విధంగా కంటెంట్ ని ఎడిట్ చేసుకోవాలి.
కావాలనుకుంటే ఈ ఫోటో లేదా వీడియోకు మ్యూజిక్, టెక్స్ట్, స్టిక్కర్లు లాంటివి యాడ్ చేసుకోవచ్చు.వీడియోను నచ్చిన విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆప్షన్ కోసం క్రిందికి స్క్రోల్ చేసి, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పై నొక్కితే షెడ్యూల్ కంటెంట్ ఆప్షన్ వస్తుంది.

ఆ తర్వాత షెడ్యూల్ థిస్ పోస్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.ఇక కంటెంట్ పబ్లిష్ అవ్వాల్సిన డేట్, టైం ఎంపిక చేసుకోవాలి.షెడ్యూల్ చేయాలనుకుంటే ప్రస్తుత సమయం నుంచి కనీసం 10 లేదా 15 నిమిషాల సమయం ముందు టైం ఎంచుకోవలసి ఉంటుంది.
తర్వాత సెట్ టైమ్ పై నొక్కి ప్రీవియస్ స్క్రీన్ కి వెళ్లి టైమ్స్ సెలక్షన్ నిర్ధారించడానికి షెడ్యూల్ పై టాప్ చేయాలి.అంతే ఇంస్టాగ్రామ్ లో సక్సెస్ ఫుల్ గా షెడ్యూల్ అవుతుంది.
ఇక ఈ కంటెంట్ ఎప్పుడైనా వ్యూ చేయవచ్చు.షెడ్యూల్ కంటెంట్ను చూడడానికి ప్లస్ ఐకాన్ లేదా ప్రొఫైల్ పై నొక్కి చూడవచ్చు.