గూగుల్ పే లో సరికొత్త ఫీచర్..!

బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ పేమెంట్స్( Digital payments ) హవా నడుస్తోంది.కరోనా వచ్చినప్పటినుంచి చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే, పేటియం లాంటి యాప్స్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు.

 A New Feature In Google Pay , Google Pay , New Feature , Digital Payments ,spli-TeluguStop.com

పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేయాలంటే మాత్రం బ్యాంకుకు వెళ్తున్నారు.చిన్నచిన్న పేమెంట్స్ అన్ని దాదాపుగా గూగుల్ పే లాంటి ఆప్స్ పై ఆధారపడుతున్నారు.

Telugu Google Pay, Split Bills, Upi-Technology Telugu

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్ గూగుల్ పే( Google Pay _ ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ సభ్యులు చెల్లించాల్సిన పేమెంట్ చాలా సులువుగా చేయవచ్చు.ఉదాహరణకు నెలకు రూ.50వేల బిల్లు ఆరుగురు వ్యక్తులు సమానంగా చెల్లించాలి అనుకోండి.ఆ సమయంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.బిల్లు మొత్తాన్ని స్ప్లిట్ చేసి ఆరుగురు సమానంగా ఎంత చెల్లించాలో లెక్కించి చూపిస్తుంది.అంతేకాకుండా ఆ మొత్తం వారు చెల్లించేలా రిమైండ్లు కూడా పంపుతుంది.

Telugu Google Pay, Split Bills, Upi-Technology Telugu

వాట్సాప్ లో గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తామో అచ్చం అలాగే గూగుల్ పే లో కూడా గ్రూప్ క్రియేట్ చేసి పేమెంట్స్ పంపించవచ్చు.గూగుల్ పే ఓపెన్ చేసి మెయిన్ పేజీలో గూగుల్ పే కాంటాక్ట్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.కొత్త స్క్రీన్ ఓపెన్ అయ్యాక కింది భాగంలో న్యూ గ్రూప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

దానిని ఓపెన్ చేసి గ్రూప్లో ఎవరెవరు ఉండాలో వారి పేర్లను నొక్కండి.తర్వాత స్క్రీన్ లో ఆ గ్రూపుకు ఒక పేరు పెట్టి గ్రూప్ క్రియేట్ చేయవచ్చు.

Telugu Google Pay, Split Bills, Upi-Technology Telugu

ఆ తర్వాత కింద కనిపించే స్ప్లిట్ యాన్ ఎక్స్ పెన్స్ బటన్ పై క్లిక్ చేసి గ్రూపు సభ్యులు చెల్లించాల్సిన అమౌంట్ నమోదు చెయ్యాలి.ఇక ఆటోమాటిక్గా గ్రూపులో ఎంతమంది సభ్యులు ఉంటే అందరికి సమానంగా ఈ ఫీచర్ నగదును విభజిస్తుంది.ఆ తరువాత వెంటనే సెండ్ రిక్వెస్ట్ బటన్ నొక్కితే పేమెంట్ ప్రోగ్రెస్ ని గ్రూప్ మెయిన్ స్క్రీన్ నుండి ట్రాక్ చేయవచ్చు.అంతేకాకుండా గ్రూపులో ఉండే సభ్యుడు చెల్లించాల్సిన మొత్తం గురించి ఆ సభ్యుడికి రిమైనింగ్ కూడా పంపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube