Google Lens : గూగుల్ లెన్స్ లో కొత్త ఫీచర్.. ఈ ఫీచర్ ఎలా ఉపయోగ పడుతుందంటే..?

గూగుల్ లెన్స్( Google Lens ) లో సరి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్.ఈ ఫీచర్ వల్ల వినియోగదారులు వారి విజువల్ సెర్చ్ హిస్టరీని సేవ్ చేసుకోవచ్చు.

 A New Feature In Google Lens How Is This Feature Useful-TeluguStop.com

మీరు విశ్లేషించే ఫోటోలను ఈ ఫీచర్ ఆటోమేటిక్ గా సేవ్ చేస్తుంది.

సాధారణంగా గూగుల్ లెన్స్ యాప్ లోని షట్టర్ బటన్ ను ఉపయోగించి ఫోటోను క్యాప్చర్ చేసినప్పుడు, ఫోటో యొక్క విశ్లేషణ కోసం గూగుల్ కి పంపి, అపై అదృశ్యం అవుతుంది.కాబట్టి మీరు మీ ఫోటోను స్టోర్ చేసేందుకు వీలు ఉండదు.అయితే సరికొత్త ఫీచర్( new feature ) వల్ల గూగుల్ టెక్ దిగ్గజం లెన్స్ క్యాప్చర్ లను ఆటోమేటిగ్ గా ఆదా చేస్తుంది.

అయితే గూగుల్ ఫోటోల ఇంటిగ్రేషన్, సెర్చ్( Google Photos integration, search ) చేయడానికి సర్కిల్ ని ఉపయోగిస్తే మాత్రం ఈ ఫీచర్ పనిచేయదు.ఈ ఫీచర్ కేవలం గూగుల్ యాప్స్ లోని లెన్స్ వినియోగానికి మాత్రమే ప్రత్యేకంగా పనిచేస్తుంది.

గూగుల్ లెన్స్ ఉపయోగించి మీరు సెర్చ్ చేసిన అన్ని ఫోటోలను వీక్షించవచ్చు.అంతేకాదు భవిష్యత్తు వాడకం కోసం ఈ ఫోటోలను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.సెట్టింగ్స్ లో ఈ ఫీచర్ ను మాన్యువల్ గా ప్రారంభించాల్సి ఉంటుంది.సెట్టింగ్స్ లో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేయాలంటే.పేర్కొన్న వెబ్ పేజీకి, డేటా& గోప్యత, ఆపై వెబ్& యాప్ యాక్టివిటీ ఎంచుకోవాలి.అక్కడ విజువల్ సెర్చ్ హిస్టరీని చేర్చు పై టోగుల్ చేయాలి.

ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి మరికొన్ని వారాలు పట్టే ఉంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే పాప్-అప్ ద్వారా ఈ ఫీచర్ కు సంబంధించిన నోటిఫికేషన్లను గూగుల్ పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube