విచిత్రమైన కాంబినేషన్‌తో సరికొత్త దోశ.. సరదాగా ఓ సారి టేస్ట్ చేస్తారా!

ప్రస్తుతం యువత అంతా సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు.సోషల్ మీడియాలో సెలబ్రెటీలు కావడం కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు.

 A New Dosha With A Strange Combination Have A Fun Time And Taste It , Maggie Do-TeluguStop.com

కొందరైతే వెరైటీగా చేయాలని ఏదో ఒకటి చేసేస్తున్నారు.ఇంకొందరు ఏకంగా ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు.

ఎక్కువగా లైకులు, వ్యూస్ రావాలని కోరుకుంటూ ఇలాంటి పనులు చేస్తున్నారు.చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.

అయితే ఒక్కోసారి యువత చేసే పనులు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.ఇటీవల తెలంగాణలో ఓ యువకుడు ట్రైన్ పట్టాలపై ఇన్‌స్టా రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

ఇక అమ్మాయిలు అయితే డ్యాన్సులతో, వివిధ రకాల వంటకాలతో తమదైన పంథాలో వీడియోలు చేస్తున్నారు.తాజాగా ఓ యువతి వెరైటీ కాంబినేషన్ వంటంకతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అంజనీ ధింగ్రా అనే ఫుడ్ బ్లాగర్ రకరకాల వెరైటీ వంటకాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఆమె ఓ సరికొత్త వంటకాన్ని రుచి చూడండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.పెనంపై దోశ వేసిన తర్వాత దానిపై మధ్యలో ఆమె వెరైటీగా నూడిల్స్ వేసింది.

ఆ తర్వాత లొట్టలు వేసుకుంటూ ఆ వెరైటీ దోశ కాంబినేషన్ తినేసింది.ఈ వీడియోను sooosaute అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియోను చూడగానే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇలాంటి కాంబినేషన్లు మీ మనసుకు ఎలా తడతాయని ప్రశ్నిస్తున్నారు.

తాము మాత్రం ఇలాంటివి ట్రై చేయలేమని కొందరు కామెంట్లు పెడుతున్నారు.ఇంకొందరు ఆమె వంటకం తర్వలో బాగా ఫేమస్ అవుతుందని, వీడియో తొలగించ వద్దని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube