నెటిజన్లు చాలా క్యూరియస్ గా ఉంటారు వారు రకరకాల విషయాలను బయటపెడుతుంటారు.అయితే తాజాగా ఒక వ్యక్తి వాషింగ్ ప్రాసెస్‌ను రికార్డ్ చేయడానికి తన డిష్‌వాషర్‌లో గోప్రో కెమెరాను( GoPro camera in dishwasher ) ఉంచాడు.
ఆ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశాడు.ఈ వీడియోలోని దృశ్యాలు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.
అలాగే డిష్‌వాషర్ లోపల బ్రౌన్ కలర్ వాటర్ చూసి కొందరు ఆశ్చర్యపోయారు.అదేంటి అలాంటి రంగు వస్తోందంటూ, ఆ వాటర్ చూస్తుంటేనే కడుపులో తిప్పుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు గో ప్రో కెమెరాను ఒక కవర్లో వేసి దాన్ని డిష్ వాషర్ ( Dish washer )లో పెట్టి ఆన్ చేయడం కనిపిస్తుంది.ఆ తర్వాత డిష్ వాషర్ ఆన్ చేయగా అది ప్లేట్లను కడగడానికి వాటర్ పంపడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ వీడియో చాలా మంది నెటిజన్లకు అసహ్యం కలిగించింది, వారు కామెంట్ సెక్షన్‌లో తమ ఆందోళనను వ్యక్తం చేశారు.కొంతమంది వినియోగదారులు బ్రౌన్ వాటర్ ఎందుకు వస్తోంది అంటూ ప్రశ్నించారు, మరికొందరు డిష్‌వాషర్ పరిశుభ్రత గురించి ఆందోళన చెందారు.
డిష్‌వాషర్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియో చర్చకు దారితీసింది.ఇకపోతే డిష్‌వాషర్‌ను శుభ్రం చేయడానికి, కమర్షియల్ డిష్‌వాషర్ క్లీనర్ లేదా వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
మీరు డిష్‌వాషర్‌ను వేడి నీటితో ఎంప్టీ గా కూడా నడపవచ్చు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







