ఓ వ్యక్తి తన వ్యవసాయ పొలాన్ని చూసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి, వ్యవసాయ పొలంలో దారుణ హత్యకు గురైన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.జడ్చర్ల మండలంలోని( Jadcherla ) ఆలూరు గ్రామానికి చెందిన 35 ఏళ్ల మల్లికార్జున్( Mallikarjun ) గురువారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు.
అర్ధరాత్రి అయినా మల్లికార్జున్ ఇంటికి రాకపోవడంతో శుక్రవారం ఉదయం భార్య మంజుల( Manjula ) వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూస్తే వరి ధాన్యం కుప్పల పక్కన మల్లికార్జున్ హత్యకు గురై విగతాజీవీగా పడి ఉన్నాడు.

ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే జడ్చర్ల పట్టణ సీఐ రమేష్ బాబు( CI Ramesh Babu ) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.
ప్రత్యేక క్లూస్ టీం సంఘటన ప్రాంతంలో ఆధారాల కోసం అన్వేషించడం జరిగింది.మల్లికార్జున ప్రవర్తన గురించి పోలీసులు గ్రామంలో విచారించగా.అందరితో మల్లికార్జున కలివిడిగా ఉండే మనిషిని తెలిసింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏమైనా అక్రమ సంబంధం( Illegal Affair ) నేపథ్యంలో హత్య జరిగిందా.లేదంటే హత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.మల్లికార్జున్ హత్యలో కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందా అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి భార్యతో పాటు మరికొంతమందిని పోలీసులు అనుమానిస్తున్నారు.అందరిని తమదైన శైలిలో విచారించి హంతకులను త్వరలోనే పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని సీఐ రమేష్ బాబు తెలిపారు.
మల్లికార్జున్ హత్యతో ఆలూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.







