సౌదీకి చెందిన వ్యక్తికి వింత జబ్బు.. 30 ఏళ్లుగా నిద్ర అనేది లేదట..!

మనుషులకే కాదు జంతువులకు కూడా నిద్ర అనేది ఎంత అవసరమో అందరికీ తెలిసిందే.రోజంతా పనిచేసిన శరీరానికి ఇచ్చే విశ్రాంతిని నిద్ర అంటారు అని అందరికీ తెలిసిందే.

 A Man From Saudi Has A Strange Disease He Has Not Slept For 30 Years ,  30 Years-TeluguStop.com

మంచి గా నిద్రపోతేనే శరీరం యాక్టివ్ గా పని చేయగలుగుతుంది.అదే నిద్ర లేకుండా ఉంటే ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో చాలా వరకు తెలిసిందే.

అంతెందుకు మనం ఒక రోజు నిద్రపోకపోతేనే మరుసటి రోజు ఎంత డల్ గా ఉంటామో తెలుసు కదా.అదే 30 ఏళ్లుగా నిద్రపోకుంటే ఎలా.? ఊహించుకోడానికే కాస్త భయంగా అనిపిస్తుంది.కానీ ఓ వ్యక్తి 30 సంవత్సరాలుగా నిద్రపోకుండా( without sleeping ) జీవనం కొనసాగిస్తున్నాడు.

ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

సౌదీ లోని బాహా రీజియన్( Baha region ) లో నివసిస్తున్న 70 ఏళ్ల సౌద్ బిన్ మొహమ్మద్ ఆల్ హమ్ది( Saud Bin Mohammad Al Hamdi ) రిటైర్డ్ మిలటరీ మెన్.అయితే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక ఆపరేషన్ లో భాగంగా దాదాపుగా 20 రోజుల పాటు నిద్ర లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందట.ఆ తర్వాత కొద్ది రోజులకు ఈయన రిటైర్డ్ అయ్యాడు.

కొంతకాలం ఆరోగ్యంగానే ఉన్న ఈ పెద్దాయనకు నిద్రలేమి సమస్య మొదలయ్యింది.ఇక రోజులు గడుస్తున్నాయి కానీ నిద్ర అనేది రావడం లేదట.

నిద్రపోకపోయినా కూడా మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా ఉన్నాడు.ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరలేదు.వైద్యులు ఎన్ని రకాల పరీక్షలు చేసిన నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోలేకపోయారు.అప్పటినుంచి గత 30 సంవత్సరాలుగా ఆ పెద్దాయన నిద్ర లేకుండానే జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.

ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వింత జబ్బుకు గల కారణాలు ఏమిటో వైద్యులకు ఇప్పటికీ కూడా అంతుచిక్కడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube