ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది.హైవేపై ఓ ట్యాంకర్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయింది.
గుర్తించిన ట్యాంకర్ డ్రైవర్ వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను నీటితో చల్లబరిచేందుకు ప్రయత్నించారు.
అనంతరం ట్యాంకర్ నుంచి యాసిడ్ లీక్ ను అదుపు చేశారు.దేవరపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.







