కాలం మారుతున్న కొద్దీ ప్రేమికులు రకరకాల పనులు చేసి కాస్త వార్తలకు ఎక్కడం పరిపాటిగా మారడం మనం చూస్తూనే ఉన్నాం.ప్రేమికులని చెప్పుకుంటూ కొంతమంది యువత బహిరంగ ప్రదేశాల్లో చేసే అసభ్యకరమైన పనులు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉన్నాం.
ఇవన్నీ సరిపోనట్టు ఈ మధ్యకాలంలో ప్రేమికులు ఏకంగా వారి వివాహాలను చిత్రవిచిత్రాలుగా జరుపుకుంటున్నారు.ఇకపోతే తాజాగా ఓ ప్రేమ జంట ఇలాంటి విచిత్ర ఘటనకు పాల్పడింది.
తాజాగా ఆ ప్రేమ జంట చేసిన పని కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కొడుతోంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

కదులుతున్న రైలులో ఓ యువకుడు హఠాత్తుగా ఓ యువతి వద్దకు వెళ్లి ప్రవర్తించిన తీరు అక్కడి ఉన్నవారినందరికి షాక్ గురయ్యేలా చేసింది.పూర్తి వివరాలకు వెళితే.పశ్చిమబెంగాల్( West Bengal ) రాష్ట్రంలోని అసనోస్సాల్ రైల్వే స్టేషన్, జూసిదిహ్ రైల్వే స్టేషన్ మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అప్పటివరకు ఆ రైలులో ప్రయాణికులు రద్దీగా ప్రయాణిస్తున్న సమయంలో ఉన్నటువంటి సంఘటన చోటుచేసుకుంది.అంతమంది ప్రయాణికుల రద్దీ ఉన్న కానీ ఓ యువకుడు వారిని నెట్టుకుంటూ హఠాత్తుగా ఓ యువతి వద్దకు వెల్లగా వెంటనే ఆ యువతి పైకి లేచి నిలబడింది.

ఆ సమయంలో ఆ యువకుడు చేతిలో హారాన్ని పట్టుకొని ఆ యువతితో కొద్దిసేపు మాట్లాడాడు.ఆ తర్వాత ఆ యువతీని కొద్దిసేపు తర్వాత సీట్లో కూర్చోబెట్టి తాళి కడుతున్న మాదిరిగానే ఆమె మెడలో ఆహారాన్ని వేశాడు.దీంతో అక్కడ ఉన్న వారంతా ఏమైతుందో తెలియక షాక్ లో ఉన్నారు.ఆ తర్వాత ప్రయాణికులు తీసుకొని వారిద్దరూ ఇష్టపూర్వకంగా చేసిన ఈ పనిని చేసేదేమీ లేక వారికే సపోర్ట్ చేశారు.
ఆ తర్వాత అబ్బాయి తెచ్చిన బ్యాగులో నుండి పూలదండలు తీసి ఒకరికి ఒకరు మార్చుకున్నారు.ఆ సమయంలో తీసిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఈ వీడియోకు సంబంధించి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ రూపంలో వారి స్పందనను తెలుపుతున్నారు.ఇలాంటి విషయాలు కేవలం భారత్( India ) లోనే సాధ్యమంటు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని చూసేయండి.







