సంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో డ్రగ్స్ పరిశ్రమలోకి చిరుత ప్రవేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిరుతను బోనులో బంధించారు.అనంతరం చిరుతను అధికారులు హైదరాబాద్ జూకు తరలించారు.
అధికారులు చిరుతను పట్టుకోవడంతో సమీప పరిశ్రమల్లోని కార్మికులతో పాటు సమీప ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.







