మంగళగిరి పార్టీ కార్యాలయంలో న్యాయవాదులకు మద్ధతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జరిగే నష్టాన్ని న్యాయవాదులు ముందుగానే గుర్తించారని పవన్ కల్యాణ్ తెలిపారు.విశాఖలో దోచుకున్న ఆస్తులను లెజిటమేట్ చేసుకునేందుకే చట్టం తెచ్చారని ఆరోపించారు.
కోర్టులను కాదని రెవెన్యూకు పూర్తి అధికారం ఇస్తే పవర్ అంతా రెవెన్యూ అధికారుల చేతుల్లోకి వెళ్తుందని చెప్పారు.భవిష్యత్లో రుషికొండను కూడా దోచుకోవచ్చని ఆరోపించారు.
ఇది పౌర హక్కుల్ని కాలరాసే చట్టం అని విమర్శించారు.ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చేయాలని తెలిపారు.
తన శక్తి మేరకు ఈ చట్టం అమలు కాకుండా పోరాడతానని స్పష్టం చేశారు.







