ఓబుళాపురం అక్రమ గనుల తవ్వకాల కేసులో కీలక పరిణామం

ఓబుళాపురం అక్రమ గనుల తవ్వకాల కేసులో హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులోని నిందితులపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది.

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ మినహా కేసులోని నిందితులు అందరిపైనా నమోదు చేసిన అభియోగాలపై నవంబర్ 11 నుంచి సాక్షుల విచారణను చేపట్టాలని నిర్ణయించింది.తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే కారణంగా శ్రీలక్ష్మీపై అభియోగాల నమోదును సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

అదేవిధంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో పాటు ప్రస్తుతం తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్న సబితా ఇంద్రారెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ అధికారులపై న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసింది.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?
Advertisement

తాజా వార్తలు