అమరావతిపై కీలక నిర్ణయం.. శ్వేతపత్రం విడుదల 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( AP CM Chandrababu Naidu ) దూకుడు పెంచుతున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, అనేక అభివృద్ధి పనుల ను వేగవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.

గత వైసిపి ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను పై విచారణలు చేయిస్తూ వాటిపై శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో పాలనను గాడిలో పెట్టేందుకు తనదైన శైలిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు.

దీనిలో భాగంగానే ఏపీ రాజధాని అమరావతిపై పూర్తిస్థాయిలో చంద్రబాబు దృష్టి సారించారు.  ఈ మేరకు అమరావతిపై శ్వేత పత్రంను విడుదల చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

  ప్రస్తుతం అమరావతి వాస్తవ పరిస్థితి పై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో మంత్రి నారాయణతో( Minister Narayana ) పాటు,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇటీవలే పోలవరంపై శ్వేతపత్రం ( Polavaram )విడుదల చేసిన చంద్రబాబు రేపు అమరావతిపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు.రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు.

రాజధాని ప్రాంతంలో పర్యటించి ఏ పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయి అనే వాటిని పరిశీలించారు.ఈ మేరకు పూర్తిస్థాయిలో యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారు.క్యాపిటల్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీకి ( Capital Regional Development Authority )కొత్త కమిషనర్ ను నియమించారు.

రాజధాని పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.  అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ లను నోటిపై చేస్తూ గెజిట్ జారీ చేసింది.

దీని ద్వారా అమరావతి నిర్మాణంలో కీలక అడుగు వేసినట్లే   రాజధానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుపుకుంటున్న 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డిఏ నోటిపై చేసింది.

టార్గెట్ జగన్... పులివెందుల నుంచే మొదలుపెట్టిన బాబు
' పిన్నెల్లి ' కి జగన్ మద్దతు ... ఈసీకి టీడీపీ ఫిర్యాదు ?

మాస్టర్ ప్లాన్ లోని నిబంధనలను అనుసరించి నేలపాడు,  లింగాయపాలెం, రాయపూడి కొండమ రాజుపాలెం,  శాఖమూరు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిపై చేశారు.పూర్తి స్థాయిలో అమరావతిలో నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు  చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు