హైదరాబాద్ లోని చైతన్యపురి జంక్షన్ వద్ద రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది.ఎల్బీనగర్ నుంచి దిల్ సుఖ్ నగర్ కు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఒక్కసారిగా కొంత భాగం కుంగిపోయింది.
సుమారు రెండు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో రోడ్డుపై గుంత పడింది.దీంతో వాహనాదారులు తీవ్ర భయందోళనకు గురయ్యారు.
గుంతను చూసిన వాహనదారులు అప్రమత్తంగా వ్యవహారించడంతో పెను ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు గుంత చుట్టూ మార్క్ చేయడంతో పక్క నుంచి వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి.
దీంతో ఎల్బీనగర్ -దిల్ సుఖ్ నగర్ రోడ్డుపై స్వల్ప ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.







