Goat Palm Tree : ఇదేందయ్యా ఇది.. తాటి చెట్టు ఎక్కిన మేక.. చూస్తే షాకే..

మనుషులు కాకుండా చెట్లు ఎక్కే జంతువులు చాలానే ఉంటాయి.వాటిలో పులులు, పిల్లులు, సింహాలు, ఎలుగుబంట్లు, కోతులు ఇలా ఎన్నో ఉన్నాయి.

శునకాలు మాత్రం చెట్లు ఎక్కలేవు.మేకలు, గొర్రెలు కూడా ఈ పని చేయలేవు.

A Goat Climbing A Palm Tree Shocking To See , Goats, Gravity, Tree Trekking, Vi

కాగా తాజాగా ఒక మేక తాటిచెట్టు ఎక్కి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇది చూసి ఇదేందయ్యా ఇది మేం ఎన్నడూ ఇలాంటిది చూడలే అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.ఈ మేక వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సామ్రాట్ గౌడ ట్విట్టర్‌ వేదికగా షేర్ చేశారు.

Advertisement

షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే 6 వేలకు పైగానే వ్యూస్ వచ్చాయి.వావ్ ఈ మేక మామూలుది కాదు, ఒక మేక చెట్టు ఎక్కడాన్ని చూడటం ఇదే ఫస్ట్ టైమ్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

కొందరు మాత్రం ఇది ఇంపాజిబుల్ అంటున్నారు.మరికొందరు ఇది ఫేక్ వీడియో అయి ఉండొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు.

వీడియోలో చూస్తే ఈ మేక పైకి ఈజీగానే ఎక్కింది.తర్వాత కిందకు చాలా నెమ్మదిగా ఎవరో పట్టుకున్నట్లు దిగింది.

దీన్ని బట్టి చూస్తుంటే ఎవరో దీన్ని తాడు సాయంతో చెట్టు ఎక్కించి మళ్లీ చెట్టు దింపారనే ఒక అనుమానం కలుగుతుంది.ఏదేమైనా ఒక మేక ఎలాగోలా ఒక చెట్టు ఎక్కి అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

సాధారణంగా మేకలు, గొర్రెలు కొండలను అవలీలగా ఎక్కేస్తుంటాయి.కాబట్టి చెట్టు ఎక్కడ వీటికి పెద్ద కష్టమేమీ కాదని ఇంకొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోని మీరు కూడా తిలకించండి.

Advertisement

తాజా వార్తలు