Mayer Rokitansky Kuster Hauser syndrome (MRKH) ఈ వింత సిండ్రోం గురించి ఎప్పుడైనా విన్నారా? ఖచ్చితంగా విని ఉండరు.ఎందుకంటే కోట్ల మహిళల్లో ఒకరికి ఇలాంటి వింత సమస్య ఉంటుంది.
ఈ సమస్య ఏమిటంటే, ఇది ఉన్న మహిళలు శృంగారం చేయలేరు.ఎందుకంటే వారికి వేజైనల్ ఓపెనింగ్ అనేది ఉండదు.
ఇంకో మాటలో చెప్పాలంటే ఉటేరస్ ఉండదు.దాంతో వారికి పీరియడ్స్ రావు.
బిడ్డను కలిగే వీలు ఉండదు.అసలు ఓ మగవాడితో శారీరకంగా కలిసే అవకాశం ఉండదు.
ఇలాంటి వింత కండీషన్ తో బాధపడుతోంది 21 ఏళ్ల కేలీ మొట్స్.
పుట్టడమే ఈ కండీషన్ తో పుట్టినా, ఇలాంటి సమస్య ఒకటి ఉంటుంది అని ఆమె తల్లిదండ్రులకి అవగాహన లేదు.
తను అందరిలాగా కాదు అని ఎలా చెప్పాలో వారికి కూడా అర్థం కాలేదు.ఏ డాక్టర్ ని కలవలేదు.
అమ్మాయి ఓ వయసుకి వచ్చాక తనకు మిగితా అమ్మాయిల్లా పీరియడ్స్ ఎందుకు రావడం లేదని భయమేసింది.డాక్టర్ సమస్య ఏమిటో చెప్పారు.
సర్జరీ అంటే చాలా ఖర్చు అవుతుంది.తమ తాహతుకి మించిన ఖర్చు.
తనకి ఇక జీవితంలో ప్రేమ, పెళ్ళి, శృంగారం, పిల్లలు వద్దు అనుకుంది కేలి.కాని 21 ఏళ్ళు రాగానే రాబ్బి అనే అబ్బాయి పరిచయం అయ్యాడు.
ప్రేమలో పడకుండా తనని తానూ ఆపుకోలేకపోయింది.అబ్బాయికి ఆ క్షణమే చెప్పేసింది, తనకి ఇలాంటి సమస్య ఉన్నట్టు, తను అందరిలాంటి అమ్మాయి కాదు అని.అతను ఆ సమస్య గురించి విని వెనుకడుగు వేయలేదు.నాకు కావాల్సింది నీతో సమయాన్ని, జీవితాన్ని గడపడం, శారీరకంగా కలవపోయినా ఫర్వాలేదు అన్నాడు.
అలాంటి ప్రేమికుడు దొరికిన తరువాత ఏ అమ్మాయికి మాత్రం మామూలు జీవితం మీద ఆశ పుట్టదు చెప్పండి? కేలికి తన బాయ్ ఫ్రెండ్ తో శృంగారం చేయాలని ఉంది.పెళ్ళి చేసుకొని పిల్లల్ని కనాలని ఉంది.
అందుకే తన సర్జరీ కోసం ఖర్చయ్యే $15,000 డాలర్లు జమ చేసే పనిలో పడింది.ఒక ఫండ్ రేసింగ్ ప్రోగ్రాం మొదలుపెట్టింది.
ఆమె సమస్య గురించి తెలుసుకున్న వారు చాలామంది ఆమెకి డొనేషన్స్ పంపిస్తున్నారు.ప్రతీ నెల తన బాయ్ ఫ్రెండ్ కూడా తన వంతుగా డొనేషన్ పంపడం విశేషం.
సర్జరీ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి? సర్జరీ ఫలితం ఎలా ఉన్నా ఇద్దరు పెళ్ళి చేసుకుంటారట.కుదిరితే సర్రోగేసి పద్ధతిలో తన సోదరి ద్వారా బిడ్డను కంటాను అంటోంది కేలి.
అలా కూడా కాకపొతే పిల్లల్ని దత్తత తీసుకుంటాము అంటున్నారు ఈ ప్రేమికులు.చూసారా … వీరి ప్రేమబంధం ఎంత గట్టిగా, స్వచ్చంగా ఉందొ !
.






