మధ్యాహ్నం భోజనం లో పురుగులు వస్తున్నాయంటూ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన నాలుగో తరగతి విద్యార్థిని

మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ లోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నంత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం లో పురుగులు వస్తున్నాయంట పూజిత నాలుగో తరగతి విద్యార్థిని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది.

వారం రోజులుగా మధ్యాహ్నం భోజనం లో పురుగులు రావడం తో ఈరోజు పాఠశాలకు వెళ్లకుండా నేరుగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసింది.

అన్నం లో పురుగుల తో పాటు రాళ్లు కూడా వస్తున్నాయని ఇతర విద్యార్థులు తెలిపారు.స్పందించిన మీర్ పేట్ పోలీస్ లు సిబ్బంది స్కూల్ లోకి వెళ్లి బియ్యం,నూనె,కుళ్ళిపోయిన స్థితి లో ఉన్న కూరగాయలను స్వాధీనం చేసుకున్నారు.

తమ గుంపును కాపాడుకోవడానికి ప్రాణ త్యాగం చేసిన అడవి దున్న.. అంతలోనే వెన్నుపోటు..?

తాజా వార్తలు