ఇటీవల కాలంలో చూసుకుంటే ఢిల్లీ మెట్రో( Delhi Metro ) అనేకమైన ఘటనలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంది.ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సులభమైన ప్రయాణాన్ని అందించేందుకు అందుబాటులోకి వచ్చిన ఢిల్లీ మెట్రో అనేది ఇటీవల కాలంలో అనేక విచిత్రమైన ఘటనలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోవడం దురదృష్టకరం.
అయితే దానికి ప్రధాన కారణం సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు.పాపులారిటీ సంపాదించుకోవడం కోసం ఢిల్లీ మెట్రోలోని స్థానిక జనాలు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడం మనం చూడవచ్చు.

దానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.అది చూసి అందరూ షాక్ అవడం పరిపాటిగా మారింది.ఒక్కోసారి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ కోసం కొట్టుకున్నట్లుగానే ఢిల్లీ మెట్రోలో కూడా జనాలు కొట్టు కోవడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఇప్పుడు మరొకటి ట్విట్టర్ వేదికగా వెలుగులోకి వచ్చింది.
ఏకంగా ఇద్దరు వ్యక్తులు మెట్రోలో దారుణంగా కొట్టుకున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో( Social Media ) హల్ చల్ చేస్తోంది.వారిద్దరిని తోటి ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు.ఇక ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఢిల్లీ మెట్రో ‘ప్రయాణికులు అందరూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి!’ అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ప్రయాణికుల తీరులో మార్పు రాకపోవడం కొసమెరుపు.మెట్రోలో ప్రవర్తన సరిగా లేని వారిపై చట్ట నిబంధనల ప్రకారం అవసరమైతే చర్యలు తీసుకునేందుకు కూడా సిబ్బంది సిద్దంగా ఉన్నారు.అయినప్పటికీ ప్రయాణికులు ( Passangers ) వెనక్కి తగ్గడం లేదు.
ఇలాంటి సంఘటనే ఇటీవల జరిగింది.ఇద్దరు పురుషులు ఏకంగా మెట్రోలో అందరి ముందే ఒకరిని ఒకరు దారుణంగా కొట్టుకునేందుకు సిద్ధమడవడం.
ఇక ఒకరిని ఒకరు వెనక్కి నెట్టుకోవడం లాంటి జరిగింది.







